Churidar Gang: ఇప్పటి వరకు చెడ్డీ గ్యాంగ్ దోపిడీల గురించి విన్నాం, చూశాం. కానీ, తెరపైకి ఇప్పుడు మరో గ్యాంగ్ వచ్చింది అదే చూడీదార్ గ్యాంగ్. చుడీదార్ ధరించి,..
కొన్నిరోజులుగా విజయవాడ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న చెడ్డీ గ్యాంగ్ ఎట్టకేలకు చిక్కింది. గుజరాత్‌లో నిఘా వేసిన విజయవాడ పోలీసులు చెడ్డీ గ్యాంగ్‌కు చెందిన ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అరెస్ట్ అయిన వారిలో గుజరాత్‌లోని దాహోద్ జిల్లా గుల్చర్ గ్రామానికి చెందిన మడియా కాంజీమేడా, సక్ర మండోడ్, మధ్యప్రదేశ్‌కు చెందిన కమలేష్ బాబేరియా అలియాస్ కమలేష్ అలియాస్ కమ్లా జుబువా ఉన్నారు. పరారీలో ఉన్న మిగిలిన ఏడుగురి కోసం గుజరాత్‌లోనే ఉన్న మరో పోలీసుల…
విజయవాడ పోలీసులకు కొన్నిరోజులుగా చెడ్డీ గ్యాంగ్ చెమటలు పట్టిస్తోంది. ఈ నేపథ్యంలో చెడ్డీ గ్యాంగ్ వివరాలను విజయవాడ పోలీసులు కనిపెట్టారు. ఈ మేరకు చెడ్డీ గ్యాంగ్ ఫోటోలను విజయవాడ సీపీ విడుదల చేశారు. గుజరాత్‌లోని దాహోద్ జిల్లా నుంచి చెడ్డీ గ్యాంగ్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పోలీసులు జాయింట్‌గా గుజరాత్‌లోని దాహోద్ పోలీసులను సంప్రదించి పలు కీలక వివరాలను రాబట్టారు. ఈ విచారణలో చడ్డీ గ్యాంగ్‌లో కొంతమంది ఏపీకి వచ్చారని గుజరాత్ పోలీసులు…
ఆంధ్రప్రదేశ్‌లో చెడ్డీ గ్యాంగ్‌లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెడ్డి గ్యాంగ్‌కు విఙప్తి అంటూ జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ సెటైర్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో సంచరిస్తున్న చెడ్డి గ్యాంగ్ వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మంత్రులు, సలహాదారుల ఇళ్లల్లో దోచుకోవాలి. నగర శివారుల్లోని పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లల్లో దోపిడీలు చేయడం సరికాదు. వైసీపీ నేతల ఇళ్లల్లో బోల్డంత డబ్బు ఉంది.. వాటిని దోచుకోండి. ముఖ్యంగా మంత్రి…
ఏపీలో చెడ్డీ గ్యాంగ్ రెచ్చిపోతోంది. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం సమీపంలోనే చెడ్డీ గ్యాంగ్ దోపిడీలకు పాల్పడుతోంది. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు సంబంధించిన విల్లాల్లోకి చొరబడిన చెడ్డీ గ్యాంగ్… విలువైన వస్తువులు అపహరించేందుకు ప్రయత్నించింది. ఈ గ్యాంగులో ఉన్న ఐదుగురు సభ్యులు చెడ్డీలు, తలపాగాలు ధరించి ఉన్నారు. చేతిలో మారణాయుధాలు కూడా ఉన్నాయి. ఈనెల 3న అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా… మూడు రోజుల పాటు పోలీసులు ఈ విషయాన్ని…
విజయవాడ నగరంలో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తోందన్న వార్తలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. టూటౌన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్నట్లు సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే చెడ్డీ గ్యాంగ్ ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడుతుందన్న విషయంపై పోలీసులకు స్పష్టత అందాల్సి ఉంది. చెడ్డీ గ్యాంగ్ సంచారంపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారి వల్ల ఎవరికైనా నష్టం కలిగితే ప్రజలు వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. Read Also: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు…