బీజేపీ నేత, పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్‌తో సహా మరో వ్యక్తిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. అయితే.. ఆశిష్ గౌడ్ రూ. రెండున్నర కోట్ల రుణం తీసుకొని బ్యాంకు వద్ద మార్టిగేజ్ చేసిన ఫ్లాట్లను వేరొకరికి అమ్ముకొని మోసానికి పాల్పడ్డ బీజేపీ నేత కుమారుడిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. 2018 వ్యాపార కార్యకలపాల కోసం సోమాజిగూడలోని ఎస్బీఐ శాఖ నుంచి రుణం కోసం సంప్రదించారు. పటాన్‌చెరు గౌతంనగర్ ఆశిష్ గౌడకు చెందిన 460 గజాల స్థలంలో ఉన్న ఇంటిని మార్టిగేజ్ పెట్టి రూ. 2.50 కోట్ల రుణం తీసుకున్నాడు.
అయితే రుణం చెల్లింపులో అవకతవకలకు పాల్పడటంతో రెండేళ్ళ క్రితం రుణం చెల్లించాలంటూ బ్యాంకు శివంతా ఫార్మా సుమంత్, ఆశిష్ గౌడకు నోటీసులు జారీ చేశారు. వారు స్పందించకపోవడంతో బ్యాంకు అధికారులు తనఖా పెట్టిన పత్రాల ప్రకారం ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లగా షాక్ కు గురయ్యారు. ఆ ఇంట్లోని ఫ్లాట్లను వేరొకరికి ఫోర్జరీ పత్రాలతో విక్రయించినట్లు తేలింది. దీంతో ఎస్బీఐ అధికారులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు పంజాగుట్ట పోలీసులు నిందితులపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.