Fire Accident : హైదరాబాద్‌లోని చర్లపల్లి పారిశ్రామిక వాడలో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫేస్-1 ప్రాంతంలోని కెమికల్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఆ ప్రాంతాన్ని తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. కెమికల్ ఫ్యాక్టరీలో రసాయనాల వల్ల మంటలు మిన్నంటడంతో వాటి ప్రభావం చుట్టుపక్కల పరిశ్రమలకు విస్తరించింది. సర్వోదయ కెమికల్ ఫ్యాక్టరీలో మొదలైన మంటలు సమీపంలోని ఇతర పరిశ్రమలకు వ్యాపించాయి. ముఖ్యంగా పక్కనే ఉన్న మహాలక్ష్మి రబ్బర్ కంపెనీకి మంటలు అంటుకోవడంతో పరిస్థితి మరింత…