ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్.. ఈ నెల 15వ తేదీన విజయవాడలో మ్యూజికల్ నైట్ నిర్వహించబోతున్నారు తమన్.. తలసేమియా బాధితులకు సహాయార్థం ఈ మ్యూజికల్ నైట్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.. ఈ మ్యూజిల్ నైట్ ద్వారా వచ్చిన సొమ్మును తలసేమియా బాధితులకు అందజేయనున్నారు..