Thaman meet CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్.. ఈ నెల 15వ తేదీన విజయవాడలో మ్యూజికల్ నైట్ నిర్వహించబోతున్నారు తమన్.. తలసేమియా బాధితులకు సహాయార్థం ఈ మ్యూజికల్ నైట్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.. ఈ మ్యూజిల్ నైట్ ద్వారా వచ్చిన సొమ్మును తలసేమియా బాధితులకు అందజేయనున్నారు.. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును కలిశారు.. ఈ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి.. నారా భువేశ్వరి కూడా పాల్గొన్నారు.. ఈ సందర్భంగా తమన్‌ను శాలువా కప్పి సత్కరించి.. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరించారు సీఎం చంద్రబాబు..
Read Also: Shabbir Ali : అమెరికాతో మాట్లాడే దమ్ము కేంద్రానికి లేదు
కాగా, తన సంపాదనలో కొంత మొత్తాన్ని ఛారిటీలకు అందిస్తానని కొన్ని సందర్భాల్లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వెల్లడించారు.. ఈ నెల 15న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యూఫోరియా మ్యూజికల్ నైట్ షో నిర్వహించనున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారా భువనేశ్వరి, ఎన్టీఆర్ ట్రస్ట్ మెంబర్స్ కలిసి పాల్గొన్న తమన్.. మాట్లాడుతూ.. నేను క్రికెట్ (సెలబ్రిటీ లీగ్)లో సంపాదించే డబ్బు, నా టీవీ షోలు, నా కాన్సర్ట్స్.. ఇలా.. నాకు సినిమాల ద్వారా కాకుండా బయట చేసే వాటి నుంచి సంపాదించే డబ్బు అంతా చారిటీలకు ఇచ్చేస్తానని వెల్లడించారు.. అయితే, కేవలం సినిమాల్లో సంపాదించే డబ్బులు మాత్రమే నేను ఇంటికి తీసుకెళ్తాను, నా కోసం వాడుకుంటాను అని స్పష్టం చేసిన విషయం విదితమే..
Read Also: Delhi Elections: దుమారం రేపుతున్న అభ్యర్థుల కొనుగోలు వ్యవహారం.. విచారణకు ఎల్జీ ఆదేశం
మరోవైపు, తలసేమియా బాధితుల సహాయార్థం ఈనెల 15న విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నట్టు నారా భువనేశ్వరి వెల్లడించిన విషయం తెలిసిందే.. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ ఉంటుందని.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హాజరుకానున్నారని ఆమె వెల్లడించారు.. ఇక, ఈ మధ్య హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మీడియా సమావేశంలో తమన్‌పై భువనేశ్వరి ప్రశంసలు కురిపించారు.. ఫండ్స్ రైజ్ చేసి ముందుకు ఎలా వెళ్లాలి? అని అనుకుంటూ ఉండగా తమకు ముందుగా ఒకటే పేరు గుర్తు వచ్చిందని, అది ఎన్ తమన్ అని అన్నారు. అయితే వెంటనే సారీ చెప్పి నందమూరి తమన్ అంటూ కామెంట్స్ చేశారు. గత కొంత కాలంగా తమన్ నందమూరి బాలకృష్ణతో ట్రావెల్ చేస్తున్నారు తమన్… బాలకృష్ణ చేసున్న అన్ని సినిమాలకి తమన్ సంగీతం అందిస్తున్నారు.. నందమూరి బాలకృష్ణకి తమన్ అందించే మ్యూజిక్ వేరు ఇతర హీరోలకి ఇచ్చి మ్యూజిక్ వేరు అన్నట్టుగా సోషల్ మీడియా నెటిజన్లు తమన్ కి నందమూరి తమన్ అంటూ నామకరణం చేశారు. అది ఇప్పటికే నందమూరి బాలకృష్ణ సహా పలువురు పలు వేదికల మీద ప్రస్తావించారు. ఇక, నారా భువనేశ్వరి కూడా ఆ కామెంట్ చేయడం గమనార్హం.