kangana ranaut interesting Comments on ISRO Women Scientists: చంద్రయాన్ 3 ప్రయోగంతో భారత కీర్తిపతాకాన్ని నలుదిశలా ఎగురవేసింది ఇస్రో. చంద్రుని దక్షిణ ధ్రువంపైకి చేరుకొని అంతరిక్ష చరిత్రలోనే చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన మొదటి దేశంగా నిలిచింది. ఇక చంద్రుడి రహస్యాలను రాబట్టే ప్రయత్నం చేస్తోంది ఇస్రో. ఇక ఇప్పటికే రోవర్ ఆ పనిని మొదలు పెట్టేసింది. ఇస్రో సాధించిన విజయంతో అనేక మంది ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక…
అంతరిక్ష పరిశోధన చరిత్రలో మొట్టమొదటిసారిగా చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై నేల ఉష్ణోగ్రతను వివరించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన విక్రమ్ ల్యాండర్‌లోని ChaSTE(చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్) పేలోడ్ సహాయంతో చంద్రయాన్-3 చేసిన పరిశోధనలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. తెలుగు భాష కూడా చాలా ప్రత్యేకమైంది.. సంస్కృతం లాగానే తెలుగు కూడా అతి పురాతనమైన భాష.. ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకోబోతున్నామని ఆయన పేర్కొన్నారు.
రాజస్థాన్ లోని మేవార్ విశ్వవిద్యాలయం మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే, చంద్రయాన్-3 విజయోత్సవ వేడుకల్లో కాశ్మీరీ విద్యార్థులు, ఇతర విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. మేవార్ యూనివర్శిటీలో రెండు విద్యార్థి వర్గాల మధ్య జరిగిన ఈ వివాదం తీవ్రరూపం దాల్చి రాళ్లు రువ్వడంతో పాటు కత్తితో దాడి చేసుకునే వారికి చేరుకుంది.
చంద్రుడిపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 మిషన్ లక్ష్యాలలో మూడింటిలో రెండింటిని సాధించామని ఇస్రో తెలిపింది.
తనను అల్లారుముద్దుగా పెంచిన కన్న తల్లికి ఓ కూతురు వెరైటీ గిఫ్ట్ ఇచ్చింది. అయితే.. చిన్నప్పుడూ చందమామ రావే..జాబిల్లి రావే.. అంటూ తనను ఎత్తుకొని గోరుముద్దలు తినిపించిన అమ్మకి చందమామపైనే స్థలాన్ని కొని బహుమతిగా ఇచ్చింది.
చంద్రయాన్-3 విజయవంతం కావడంతో నేడు ప్రపంచం మొత్తం భారతీయ శాస్త్రవేత్తలను కొనియాడుతోంది. ఈ ఘనతపై ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా బెంగళూరులోని ఇస్రో కార్యాలయానికి వెళ్లి శాస్త్రవేత్తలను అభినందించి తదుపరి మిషన్‌ను ప్రోత్సహించారు.
దేశ అంతరిక్ష యాత్రకు ప్రధాని నరేంద్ర మోదీ కొత్త వేగం, శక్తిని అందించారని, చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారతదేశం అవతరించిందని హోం మంత్రి అమిత్ షా శనివారం అన్నారు.
చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ అయిన శివశక్తి పాయింట్ చుట్టూ ప్రజ్ఞాన్ రోవర్ తిరుగుతున్నట్లు చూపించే వీడియోను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శనివారం విడుదల చేసింది. "ప్రజ్ఞాన్ రోవర్ దక్షిణ ధృవం వద్ద చంద్ర రహస్యాలను వెతకడానికి శివశక్తి పాయింట్ చుట్టూ తిరుగుతోంది." అని ట్విటర్ వేదికగా చెప్పింది.