Tollywood Rewind 2023: Tollywood Celebrities Who Died in 2023: 2023లో టాలీవుడ్ సినీ పరిశ్రమకు చాలా నష్టం జరిగింది. తారకరత్న చంద్రమోహన్, కె.విశ్వనాథ్, శరత్ బాబు సహా ఎంతో మంది సినీ ప్రముఖులు కనుమూశారు. 2023 చివరికి వచ్చేసిన క్రమంలో ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమకు దూరమైన వారి వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. చంద్రమోహన్: ఈ ఏడాది నవంబర్ 11వ తేదీన చంద్రమోహన్ తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో…
తెలుగు చిత్రసీమలో బాపు తీతకు, ముళ్ళపూడి వెంకటరమణ రాతకు విశేషస్థానముంది. వారి జోడీ సాంఘికం తీసినా, పౌరాణికం తెరకెక్కించినా, రీమేక్స్ అందించినా జనం అభిమానించారు, ఆదరించారు. స్ట్రెయిట్ మూవీస్ తోనే కాదు, పరభాషల్లో విజయం సాధించిన చిత్రాలకు తెలుగుదనం అద్ది అందించడంలోనూ బాపు-రమణ తమదైన బాణీ పలికించారు. అలా వారి అద్దకంలో వెలుగు చూసిన చిత్రాల్లో ‘రాధా కళ్యాణం’ ఒకటి. తమిళంలో భాగ్యరాజా స్వీయదర్శకత్వంలో నటించిన ‘అంద 7 నాట్కల్’ చిత్రం ఆధారంగా ఈ ‘రాధా కళ్యాణం’…
‘అడవిరాముడు’ ఘనవిజయం తరువాత నుంచీ కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎక్కువ శాతం స్టార్ హీరోస్ తో భారీ చిత్రాలే రూపొందాయి. అడపా దడపా ‘పదహారేళ్ళ వయసు’, ‘నిండునూరేళ్ళు’ వంటి సినిమాలు కూడా తెరకెక్కాయి. అలా రాఘవేంద్రరావు రూపొందించిన ‘సత్యభామ’ సైతం జనాన్ని ఆకట్టుకుంది. తమిళంలో భాగ్యరాజా హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘మౌనగీతంగల్’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. శ్రీసరసా మూవీస్ పతాకంపై కె.సారథి ‘సత్యభామ’ను నిర్మించారు. ‘సత్యభామ’ కథను చూస్తే – పెళ్ళయి ఏడేళ్ళు పూర్తయిన ఏ…
(సెప్టెంబర్ 23న ‘దూకుడు’కు పదేళ్ళు) పది సంవత్సరాల క్రితం మహేశ్ బాబు హీరోగా రూపొందిన ‘దూకుడు’ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. విదేశాలలోనూ విజయదుందుభి మోగించింది. మహేశ్ అభిమానుల ఆనందాన్ని అంబరమంటేలా చేసింది. దాదాపు ఐదు సంవత్సరాలు తమ హీరో భారీ విజయం కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ‘దూకుడు’ మహదానందం పంచింది. ఈ చిత్రంతో మహేశ్ బాబు, దర్శకుడు శ్రీను వైట్ల తొలిసారి కలసి పనిచేశారు. ఈ సినిమాలోనే మహేశ్ తో సమంత మొదటి…
ఈ రోజు ఉదయం నుండీ చంద్రమోహన్ ఆరోగ్యంపై రకరకాల ఫేక్ న్యూస్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే ఎనభైవ జన్మదినోత్సవాన్ని సైతం చంద్రమోహన్ జరుపుకున్నారు. ఆ సందర్భంగా ఇకపై తాను సినిమాలలో నటించనంటూ ఆయన ప్రకటించారు. అయితే… దానిని తప్పుగా అర్థంచేసుకున్న కొందరు ఆయన ఫోటోలను పెట్టి రెస్ట్ ఇన్ పీస్ అంటూ వార్తలను స్ప్రెడ్ చేశారు. ఇది చంద్రమోహన్ దృష్టికి సైతం వెళ్ళింది. దాంతో ఆయన వెంటనే ఓ వీడియోను మీడియాకు విడుదల…
పొట్టివాడైనా మహా గట్టివాడు చంద్రమోహన్. ఆదివారంతో 81 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చంద్రమోహన్ ఇకపై నటనకు దూరంగా ఉంటానంటున్నారు. 1966లో రంగులరాట్నం నుంచి ఇప్పటి వరకూ తన 55 ఏళ్ళ కరీర్ లో దాదాపు 930కి పైగా సినిమాల్లో నటించారు చంద్రమోహన్. ఇటీవల కాలంలో అరుదుగా తెరపై కనపించిన చంద్రమోహన్ ఇక దర్శకనిర్మాతలను ఇబ్బంది పెట్టదలచుకోలేదంటున్నారు. హీరోగా కెరీర మొదలెట్టి సహాయపాత్రలు, క్యారెక్టర్ రోల్స్ లో, కామెడీ పాత్రల్లో తెలుగువారికి కనువిందు చేశారు. ‘రాఖీ’ తర్వాత బైపాస్…