Tollywood Rewind 2023: తారకరత్న, చంద్రమోహన్ సహా 2023లో కన్నుమూసిన తెలుగు సినీ ప్రముఖులు వీరే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood Rewind 2023: Tollywood Celebrities Who Died in 2023: 2023లో టాలీవుడ్ సినీ పరిశ్రమకు చాలా నష్టం జరిగింది. తారకరత్న చంద్రమోహన్, కె.విశ్వనాథ్, శరత్ బాబు సహా ఎంతో మంది సినీ ప్రముఖులు కనుమూశారు. 2023 చివరికి వచ్చేసిన క్రమంలో ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమకు దూరమైన వారి వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను.
చంద్రమోహన్: ఈ ఏడాది నవంబర్ 11వ తేదీన చంద్రమోహన్ తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో హృదయ రోగంతో బాధపడుతూ ఆయన కన్నుమూశారు
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
శరత్ బాబు : ఈ ఏడాది మే 22న తెలుగు సహా దక్షిణాది భాషల్లో తన విలక్షణ నటనతో ఆకట్టుకున్న శరత్ బాబు అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసారు. శరత్ బాబు మృతిపై తెలుగు సహా దక్షిణాది చిత్ర పరిశ్రమ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
‘రే స్టీవేన్‌సన్’: ఈ ఏడాది మే 22న RRR సినిమాలో బ్రిటీష్ పాలకుడి పాత్రలో నటించిన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్ అనారోగ్యంతో కన్నుమూశారు, చనిపోయే నాటికీ ఆయన వయసు 58 ఏళ్లు.
సంగీత దర్శకుడు రాజ్ : ఈ ఏడాది మే 21న ‘రాజ్ – కోటి’ ద్వయంలో ఒకరిగా పేరు తెచ్చుకున్న రాజ్ అనారోగ్యంతో కన్నుమూశారు.
మనో బాల: ఈ ఏడాది మే 3న తమిళంలో పాటు తెలుగులో తన కామెడీతో ఆకట్టుకున్న మనోబాల మే 3న తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు.
సతీష్ కౌశిక్: ఈ ఏడాది మార్చి 9న ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ అనుమానాస్పద రీతిలో చనిపోవడంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.
మయిల్‌సామి: ఈ ఏడాది ఫిబ్రవరి 19న ప్రముఖ తమిళ హాస్యనటుడు మయిల్ సామి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన దాదాపు 300 పైగా చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటించారు.
తారకరత్న ఈ ఏడాది ఫిబ్రవరి 18న నందమూరి మూడో తరం నట వారసుడు తారకతర్న నారా లోకేష్ యువగళం పాత్ర ప్రారంభమైన క్రమంలో పాల్గొని కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి శివైక్యం చెందాడు.
కే.విశ్వనాథ్ ఈ ఏడాది ఫిబ్రవరి 2న టాలీవుడ్ లెజండరీ డైరెక్టర్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ అనారోగ్యంతో బాధ పడుతూ కన్నుమూశారు. చనిపోయేనాటికి ఆయన వయసు 92 ఏళ్లు.
దర్శకుడు సాగర్ ఈ ఏడాది ఫిబ్రవరి 2మా అనారోగ్యంతో బాధ పడుతూ కన్నుమూశారు. రాకాసి లోయ చిత్రంతో డైరెక్టర్‌గా తన సినీ జీవితాన్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత అమ్మదొంగ, స్టూవర్టుపురం దొంగలు, రామసక్కనోడు, ఖైదీ బ్రదర్స్, వంటి సినిమాలను తీశారు.
జమున ఈ ఏడాది జనవరి 27న జమున వయసు రీత్యా వచ్చిన అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగు తెర సత్యభామగా తనదైన నటనతో ఆకట్టుకున్నారు ఆమె.
బాల మురుగన్ ఈ ఏడాది జనవరి 16న అనారోగ్యంతో కన్నుమూశారు. ముఖ తెలుగు, తమిళ రచయిత భూపతిరాజా తండ్రి, పాపులర్ రైటర్ బాలమురుగన్ తెలుగు, తమిళంలో పలు చిత్రాలకు రచయితగా పనిచేశారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!