ఈ రోజు ఉదయం నుండీ చంద్రమోహన్ ఆరోగ్యంపై రకరకాల ఫేక్ న్యూస్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే ఎనభైవ జన్మదినోత్సవాన్ని సైతం చంద్రమోహన్ జరుపుకున్నారు. ఆ సందర్భంగా ఇకపై తాను సినిమాలలో నటించనంటూ ఆయన ప్రకటించారు. అయితే… దానిని తప్పుగా అర్థంచేసుకున్న కొందరు ఆయన ఫోటోలను పెట్టి రెస్ట్ ఇన్ పీస్ అంటూ వార్తలను స్ప్రెడ్ చేశారు. ఇది చంద్రమోహన్ దృష్టికి సైతం వెళ్ళింది. దాంతో ఆయన వెంటనే ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు. ”ఇటీవల నా పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞతలు. నా ఆరోగ్యం పట్ల ఇటీవల ఫేక్ న్యూస్ లు వస్తున్నాయి. నాకు బాగోలేదని వచ్చే వార్తల్లో నిజం లేదు. వాటిని నమ్మకండి. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. మీ అందరి అభిమానం, ఆశీస్సులే నాకు శ్రీరామరక్ష’ అని ఆ వీడియోలో చంద్రమోహన్ తెలిపారు.