అధికారంలోకి వచ్చిన టీడీపీ.. ప్రభుత్వ యంత్రాంగాన్ని సెట్చేసుకునే పనిలో పడిపోయింది.. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ వైపు పార్టీ నేతలతో భేటీలు అవుతూనే.. మరోవైపు అధికారులపై దృష్టిపెట్టారు. దీనిలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్‌రెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించడం.. వెంటనే ఆయన సెలవుపై వెళ్లడం జరిగిపోయాయి.
కృష్ణా జిల్లా: గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మీడియా సమావేశం నిర్వహిచారు. తన గెలుపుకు కృషిచేసిన గన్నవరం నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. గన్నవరం టికెట్ ఇచ్చినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ గెలుపు కోసం కష్టపడి నియోజకవర్గంలో పనిచేశానని.. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాదని ముందుగానే తాను చెప్పానన్నారు. జగన్మోహన్ రెడ్డికి తాను చేసిన సవాల్‌ను నిజం…
Jr NTR Congratulates Chandrababu and Balakrishna: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, బిజెపి. జనసేన కూటమి భారీ మెజారిటీ సాధించి సుమారు 164 స్థానాలు దక్కించుకున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న మధ్యాహ్నం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయస్థాయిలో సైతం ఇదే అంశం మీద చర్చ జరుగుతోంది. అయితే ఆసక్తికరంగా చంద్రబాబు సహా నారా లోకేష్, బాలకృష్ణ, పురందేశ్వరి, భరత్ కి శుభాకాంక్షలు చెబుతూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ప్రియమైన చంద్రబాబు…
నేను ప్రజల సొమ్మును తింటున్నాననే బాధ్యతను అనుక్షణం గుర్తుంచుకోవాలనే జీతం తీసుకుంటున్నాను అన్నారు. నేను సరిగా పని చేయకుంటే.. ప్రతి రూపాయికి నన్ను చొక్కా పట్టుకుని నిలదీసే హక్కు ప్రజలకు ఉండాలి.. అందుకే జీతం తీసుకుంటున్నాను.. తర్వాత నేను తిరిగి ఇచ్చేది ఇచ్చేస్తాను.. వేయింతలు ఇచ్చేస్తాను.. అది వేరే విషయం అన్నారు పవన్..
జనసేన ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతోంది. అధికారంలో భాగస్వామ్యం కచ్చితంగా తీసుకుంటామని స్పష్టం చేశారు. రెండింటి మధ్య సాంకేతిక అంశాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంటుంది. త్వరలో జనసేన పార్టీ కార్యాలయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతోందన్నారు పవన్ కల్యాణ్
సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ రోజు ఉదయం చంద్రబాబు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు ఏపీ సీఎఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా.. ఇక, చంద్రబాబును కలిసిన వారిలో పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.
మా ప్రయాణం ఎన్డీఏతోనే అని స్పష్టం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. మేం ఎన్డీఏలో ఉన్నాం.. ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నా.. ఎన్డీఏ సమావేశానికి హాజరవుతున్నాం అని వెల్లడించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు.. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సూపర్ విక్టరీ సాధించింది.. దీంతో.. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ వేదికగా ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం జరగనుంది.. ఈ సమావేశంలో పాల్గొనేందుకు హస్తినబాట పట్టనున్నారు టీడీపీ చీఫ్.. ఇక, ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి..