ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఏపీ కేడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.. ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేసినట్టు పేర్కొంది ప్రభుత్వం..
మోడీ, అమిత్ షాపై సంచలన ఆరోపణలు మోడీ, అమిత్ షాపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. స్టాక్ మార్కెట్ల కుంభకోణానికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. స్టాక్ మార్కెట్ల స్కామ్పై జేపీసీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జూన్3న స్టాక్ మార్కెట్లు పెరుగుతాయని హోంమంత్రి చెప్పారని.. ఈ విషయం ఆయనకు ఎలా తెలుసని ప్రశ్నించారు. ఇది స్టాక్ మార్కెట్లో అత్యంత పెద్ద స్కామ్ అని చెప్పుకొచ్చారు.…
అమరావతి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ బయలుదేరారు. తన పర్యటన సందర్భంగా పోలీసు ట్రాఫిక్ ఆంక్షలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పర్యటన సందర్భంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా ట్రాఫిక్ ఆపొద్దని నిన్ననే(బుధవారం) చంద్రబాబు స్పష్టం చేశారు.
చంద్రబాబు మారరు అనే అపవాదు తనపై ఉందని... కానీ మీరు మారిన చంద్రబాబును చూస్తారని.. ఇక అలా ఉండదని.. మీరే ప్రత్యక్షంగా చూస్తారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పార్టీ ఎంపీలతో జరిగిన భేటీలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద కోలాహలం నెలకొంది. చంద్రబాబు, లోకేష్, ఎన్టీఆర్ బ్యానరుకు 164 బిందెలతో పాలాభిషేకం చేశారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్నాయుడు.
ఈ నెల 11న టీడీఎల్పీ సమావేశం జరుగుతుందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. టీడీఎల్పీలో చంద్రబాబుని నేతగా ఎన్నుకుని గవర్నర్ కు నివేదిక పంపుతామన్నారు.
ఏపీలో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు.