ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ.. సమస్యలను పరిష్కరించుకుంటూ.. అభివృద్ధి పథం వైపు సాగుదామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ట్విటర్(ఎక్స్) ద్వారా అభినందనలు తెలియజేశారు.
Boyapati Srinu Met Chandrababu : 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం బిజెపి జనసేన కూటమి భారీ ఎత్తున సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికీ ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది కానీ దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడమైతే ఖాయమైపోయింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇంకా పూర్తిస్థాయిలో రిజల్ట్స్ వెలువడక ముందే చంద్రబాబు…
ప్రజల ఐదేళ్ల కష్టాలకు రేపటితో అడ్డుకట్ట పడనుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.
తప్పుడు సర్వేలు చూసుకుని టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.. టీడీపీ సంబరాలు తాత్కాలికం మాత్రమే.. అసలు సంబరాలు రేపు మేం చేస్తాం అన్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఈసీ నిబంధనలు తప్పుబట్టిన ఆయన.. ఈసారి ప్రతిదీ నిబంధనలకు విరుద్ధంగానే ఈసీ చేస్తుంది.. ఈసీపై చంద్రబాబు కంట్రోల్ ఉందని తెలిసిపోతుంది.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 10 ఏళ్లు అయిందని.. రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటేనన్నారు. 10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలన్నదే నా ఆకాంక్ష అని అన్నారు.
నేడు ఎగ్జిట్ పోల్స్.. 19 రోజులుగా అభ్యర్థుల్లో టెన్షన్ పార్లమెంటు ఎన్నికల అభ్యర్థులకు, ఆయా రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచారం సుదీర్ఘ కాలం అయితే.. ఫలితాల కోసం 19 రోజుల పాటు ఎదురుచూడడం మరో ఆందోళన. ఈవీఎంలలో తీర్పు నమోదవడంతో ప్రజలు ఎటువైపు ఓటేశారోనని అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ టెన్షన్ నుంచి కొంత మందికి నేడు కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. చివరి…
విజయవాడలో డయేరియా మరణాలు ఆందోళనకరమన్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యపై దృష్టి పెట్టాలన్నారు. కలుషిత నీరు సరఫరా కారణంగానే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని, దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు చంద్రబాబు. విజయవాడలో డయేరియాతో వారం రోజుల వ్యవధిలో 9 మంది చనిపోవడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డయేరియాతో కాకుండా…
ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి వస్తారు? అనేదానిపై ఎవరి అంచనాలు వారికున్నాయి.. ఇదే సమయంలో.. బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు.. అధికారంలోకి వచ్చే పార్టీ ఏది? అని మొదలుకొని.. కీలక నేతలు పోటీ చేసే స్థానాల్లో గెలుపు ఓటములతో పాటు.. మెజార్టీలపై బెట్టింగ్ కాస్తున్నారు.. అయితే, ఇప్పుడు ఈ జాబితాలోకి నేతలు సైతం చేరుతున్నారు.. కర్నూలు జిల్లా కోసిగి జడ్పీటీసీ మంగమ్మ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు..