చంద్రబాబు కు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపించే ప్రయత్నం చేస్తున్నారు అని ఇరిగేషన్ శాఖ మంత్రి అనీల్ కుమార్ అన్నారు. అందుకే ఇవాళ కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. 14 ఏళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. 144 సంవత్సరాల్లో సోమశిల కు ఈ స్థాయి వరద రాలేదు. అన్నమయ్య ప్రాజెక్టు స్పిల్ వే క్యపాసిటీ 2 లక్షల 17 వేల క్యూసెక్కులు… కానీ ఆ రోజు ఉదయం…
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆకస్మిక మరణం తెలుగు రాష్ట్రాలకు తీరనిలోటు అన్నారు మాజీ సీఎం చంద్రబాబునాయుడు. ఆయన వాగ్దాటి, కంచుకంఠం మారుమోగుతూనే వుంటుందన్నారు చంద్రబాబు. ఆయనతో కలిసి పనిచేసిన రోజుల్ని బాబు గుర్తుచేసుకున్నారు. ఏ పదవిలో ఉన్నా రాణించిన వ్యక్తి రోశయ్య. ఆయన అజాత శత్రువు.కాంగ్రెస్ పార్టీకి రోశయ్య పెద్ద ఆస్తిగా ఉండేవారు. క్లిష్ట సందర్భాల్లో అసెంబ్లీలో రోశయ్య పాత్ర కీలకం.16 సార్లు బడ్జెట్ పెట్టిన చరిత్ర రోశయ్యది.రాజకీయంగా రోశయ్యతో విభేదించే వాళ్ళం.. కానీ…
ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఇదే విషయాన్ని పార్లమెంట్‌లో కేంద్రమంత్రి కూడా ప్రస్తావించారని ఆయన గుర్తుచేశారు. అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ జవాబుదారీతనం గురించే కేంద్రమంత్రి ప్రశ్నించారని చంద్రబాబు తెలిపారు. జగన్ సీఎం అయినంత మాత్రాన జవాబుదారీతనానికి అతీతుడా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి ఒళ్లంతా ఇగోనే అని.. చెప్పినా అర్థం కాదని ఎద్దేవా చేశారు. జగన్…
ఏపీలో జరిగిన రెండో విడత మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ విశ్లేషణ చేస్తోంది. మరి.. కుప్పంలో ఓటమిపై చంద్రబాబు పోస్టుమార్టం చేస్తారా? ఆ దిశగా ఆలోచన ఉందా? పార్టీ ఆఫీస్‌కు వస్తున్న తమ్ముళ్లు వేస్తున్న ప్రశ్నలేంటి? రెండో విడత మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ విశ్లేషణ..!కుప్పం ఓటమిపైనా పోస్టుమార్టం చేస్తున్నారా? మొదటి విడతలో ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించడంతో ఆ ఫలితాలపై విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం లేదని భావించింది టీడీపీ. రెండో విడతలో జరిగిన…
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆర్ధిక శాఖ మంత్రిగా పలు పదవులకు వన్నె తెచ్చిన రోశయ్య, సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారు అని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కొణిజేటి రోశయ్య మృతి బాధాకరమని నారా చంద్రబాబునాయుడు అన్నారు. రోశయ్య పరిపాలనాదక్షుడిగా, ఆర్థిక నిపుణుడిగా…
ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పై మాటల తూటాలతో దాడి చేశారు. చంద్రబాబు చేసిన మోసాలు, మార్చిన రంగులను ఎవ్వరూ మర్చిపోరన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లో కూడా చంద్రబాబు మనుషులు ఉన్నారన్నారు. ఎన్టీరామారావు కుటుంబాన్ని మొత్తం వాడుకున్నాడు. చంద్రబాబు ఏడవడానికి ఒక వేదిక కావాలి. వంశీ చేసిన కామెంట్ ఆయన స్వంతంగా పెట్టింది కాదు. అది సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో ఉంది…
మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత చంద్రబాబునాయుడిపై మరోమారు ఫైర్ అయ్యారు మంత్రి కొడాలి నాని. లోకేష్ సహా పలువురు టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నాగురించి వంశీ, జగన్ కుటుంబ సభ్యులపై టీడీపీ ఆఫీసు నుండి లోకేష్ చేసి పోస్టింగ్ ల పై వాళ్ళను ఏం చేయాలి? వంశీ చేసిన వ్యాఖ్యలు తన సొంతానివి కావు. సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలవి. రాజకీయాల కోసం పెళ్ళాన్ని కూడా వాడుకుంటారా? చంద్రబాబు మహా నటుడు. చంద్రబాబు లాంటి…
అసెంబ్లీలో నన్ను ఎగతాళి చేశారు.. అవమానాలకు గురి చేశారు.. అయినా భరించాను. చివరకు కుటుంబ సభ్యులను కూడా దూషించారు.. గౌరవాన్ని దెబ్బతీశారు అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని మళ్లీ సీఎంగా వస్తానని సవాల్ విసిరి వచ్చేశాను. నేను సీఎంగా ఉన్నాను.. ప్రతిపక్ష నేతగా పని చేశాను. నేనూ మనిషినే.. భార్యకు భర్తనే. నేనెప్పుడూ ఇంట్లో ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగలేదు. ప్రజల ఎప్పుడో కట్టుకున్న ఇళ్లకు డాక్యుమెంట్లు…
గురజాల, దాచేపల్లి మున్సిపల్ ఎన్నికలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎన్నికలు జరిగిన విధానంపై కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకుంటోన్నారు చంద్రబాబు. ఈ సమీక్షలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. రాత్రి పూట వైసీపీ నేతలతో సంప్రదింపులు జరిపే అలవాటును కొందరు టీడీపీ నేతలు మానుకోవాలి. నేను చచ్చినా.. నువ్వు చచ్చినా పార్టీ జండా కప్పుతారు ప్రాణాల కోసం వైసీపీ వాళ్ళతో రాత్రిళ్లు మాట్లాడుతారా..!? ఆ అవసరం లేదు అని తెలిపారు. 2014-…