ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడవరోజు కొనసాగుతున్నాయి. ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాలు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి.విద్యాశాఖ ప్రమాణాలు, పాఠశాలల్లో స్వీపర్ల వేతనాలపై గంటన్నరకు పైగా చర్చ జరిగింది. విదేశీ విద్య నిలిపేశారంటూ అచ్చెన్నాయుడు ఆరోపణలు చేశారు. నాడు-నేడు పనులు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయన్నారు విపక్ష సభ్యులు. అమ్మ ఒడి డబ్బుల్లో పరిశుభ్రత కోసం అంటూ కోత విధిస్తున్నారని.. నాడు-నేడు పనులు జాప్యం జరుగుతున్నాయన్న టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి లేవనెత్తారు. పెద్ద ఎత్తున జరుగుతోన్న పనులను పక్కన పెట్టి..…
YCP MLA Kolusu Parthasarathy reacts on TDP Leader Atchannaidu Comments. టీడీపీ నేత అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగనన్న 30 లక్షల మంది మహిళకు ఇల్లు కట్టిస్తున్నారని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టర్లకు ప్రాధాన్యం ఇచ్చారు తప్ప రైతులకు కాదని ఆయన అన్నారు. తుఫాను పరిహారం సైతం ఎగ్గొట్టలేదా…? అని ఆయన ప్రశ్నించారు. ఏదన్నా ఛార్జ్ షీట్ వేయాల్సి వస్తే…
ఆ నియోజకవర్గం టీడీపీలో సీటు కోసం పావులు కదిపేవారు ఎక్కువయ్యారా? నేతల మధ్య పోటీ పెరిగిందా? మాజీ ఎమ్మెల్యే అందుబాటులో ఉండటం లేదని కొత్త నాయకుడు కావాలంటున్నారట కార్యకర్తలు. దీంతో కొత్తవాళ్లు ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారం. ఆ పోటీకాస్తా రసవత్తరంగా మారిపోయింది. సొంత వ్యాపారాలపై మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ ఫోకస్నెల్లూరు జిల్లా వెంకటగిరిలో టీడీపీకి బలం ఉన్నప్పటికీ సరైన నేత లేక తీవ్ర అసంతృప్తిలో ఉంది కేడర్. 2004, 2009లో ఎమ్మెల్యేగా పనిచేసిన కురుగొండ్ల రామకృష్ణ 2019లో…
టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రాణాలకు ముప్పు ఉందని డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సాయుధ బలగాలతో భద్రత కల్పించాలంటూ ఆయన లేఖలో కోరారు. చంద్రబాబుకు సంఘ విద్రోహ శక్తుల నుంచి ముప్పు ఉందని లేఖలో వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి టీడీపీ కార్యాలయాన్ని సందర్శించే నాయకులకు సైతం తీవ్రవాదులు, సంఘ…
త్వరలోనే ఎన్నికలకు వెళ్లాలని సీఎం జగన్ భావిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. తాము కూడా ఎన్నికలు రెడీగా ఉన్నామని చెప్పారు. నెత్తిమీద కుంపటిని దించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయమన్నారు చంద్రబాబు. రేపో ఎల్లుండో సీఎం జగన్ ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారన్న చంద్రబాబు.. రోజు రోజుకూ పతనావస్థకు వెళ్తున్నారని.. మరిన్ని రోజులు గడిస్తే వ్యతిరేకత పెరుగుతుందని సీఎం భయపడుతున్నారని తెలిపారు.. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా…
ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం అనంతరం వాయిదా పడనుంది శాసన సభ. గవర్నర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించాక తొలిసారి నేరుగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు శాసనసభలో అడుగుపెడుతున్నారు. కరోనా కారణంగా 2020, 2021 బడ్జెట్ సమావేశాల సమయంలో వర్చువల్ విధానంలో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై…
ఏపీలో ఇప్పుడు మూడు రాజధానుల అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. మూడు రాజధానులపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి ఎంత నష్టపోయామో అందరికీ తెలుసు. తమ ప్రభుత్వం అమరావతిలోనే ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా ఉండేందుకే మూడు రాజధానులు ఆలోచన చేస్తోందన్నారు. ఈ మూడురాజధానులకు సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్న దశలో కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయి. అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు డిప్యూటీ సీఎం…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కురసాల కన్నబాబు ఆరోపణలు గుప్పించారు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ఆర్ అండ్ ఆర్ అడిగిన రైతులపై కేసులు పెట్టిన చరిత్ర టీడీపీది అని మంత్రి కన్నబాబు విమర్శలు చేశారు. చంద్రబాబు ఎప్పటికీ రైతు బంధు కాలేడని.. ఆయన రైతు రాబంధు అని అభివర్ణించారు. అమరావతిలో రైతుల పేరుతో కొందరు కృత్రిమ ఉద్యమం చేస్తున్నారని టీడీపీని ఉద్దేశించి మంత్రి కన్నబాబు మండిపడ్డారు. తమ ప్రభుత్వం అమరావతితో పాటు అన్ని…
వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై కూడా అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నమని ప్రకటించారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి.. అసెంబ్లీ సమావేశాల పై స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు అన్ని శాఖల అధికారులుతో సమీక్ష నిర్వహించారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి.. అసెంబ్లీలో ప్రజాసమస్యలను అత్యంత ప్రధాన్యంగా సమావేశాలు నిర్వహిస్తాం అన్నారు.. ప్రజా సమస్యలపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందన్న ఆయన.. గతంలో టీడీపీలా కాకుండా మేం ప్రతిపక్షాన్ని…