కృష్ణా రాజకీయాలు ఎప్పుడూ ఎండాకాలం అంత హాట్ హాట్ గా వుంటాయి. టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ జెండాను ఎగరేసిన బుద్దా వెంకన్న, నాగుల్ మీరా వైసీపీ నేతలపై మండిపడ్డారు. చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని కొంతమంది వెధవలు ప్రచారం చేస్తున్నారు. పార్టీ అడ్రస్ లేకుండా పోతుందనే ఆవేదనతో ఆనాడు ఆ నిర్ణయం జరిగింది.
ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా చంద్రబాబుకు మద్దతిచ్చారు. వెన్నుపోటంటే జగన్ కే బాగా తెలుసు.తండ్రిని బెదిదిరించి మరీ బాబాయ్ వివేకాను జగన్ వెన్నుపోటు పొడిచారు. జగన్ కుటుంబ సభ్యులు కూడా ఆయనకు మద్దతివ్వలేదు. పప్పు అని కూతలు కూసే కొడాలి నాని.. మీ నాయకుడు గన్నేరు పప్పు అనే వాస్తవం తెలుసుకో. విశ్వాసం లేని నాని లాంటి కుక్కలను చంద్రబాబు పెంచి పోషించారు.
కొడాలి నానిలాంటి నీచమైన వ్యక్తులను తరిమి కొట్టాలి. 1999 గుడివాడలో హరికృష్ణను నాలుగో స్థానంలో పడేసిన కుట్ర చేశావు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే కొడాలి నాని..వారి కుటుంబ సభ్యులను సిగ్గు లేకుండా తిడతాడు. వీరులు పుట్టిన గడ్డలో కొడాలి నాని లాంటి సన్నాసులు ఎలా పుట్టారు..? గుండీలు విప్పి… రంకెలేస్తే… నాయకుడివి అయిపోతావా..?
టీడీపీని కాపాడి అధికారంలోకి తెచ్చిన చంద్రబాబు వెన్నుపోటుదారుడా..? బాబాయిని చంపిన వారిని కాపాడుతున్న మీనాయకుడు వెన్నుపోటుదారుడా..? తండ్రిని హత్య చేసిన వారిని శిక్షించాలని చెల్లెలు కోరితే జగన్ ఏం న్యాయం చేశారు..? తన విజయం కోసం పని చేసిన సొంత చెల్లికే జగన్ వెన్నుపోటు పొడిచారు. హత్యా రాజకీయ చరిత్ర జగనుది.. చంద్రబాబు ఎవరినైనా చంపించారా..? చంద్రబాబు రౌడీ రాజకీయం చేసేవాడే అయితే నాని నోరు లెగిచేదా..?
చంద్రబాబు, జగన్ లలో ఎవరు వెన్నుపోటు దారులో బహిరంగ చర్చకు సిద్దం. ఏ సన్నాసులు వస్తారో రండి… ఛాలెంజ్ చేస్తున్నా. ఏనుగు వెళుతుంటే… కుక్కలు మొరుగుతాయి. చంద్రబాబును తిట్టే నాని లాంటి వాళ్లు కూడా కుక్కలకన్నా హీనం. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించకుండా సభలో లేని చంద్రబాబును తిట్టడానికి సమయం కేటాయిస్తారా? జగన్ లాంటి సిఎం, నాని లాంటి మంత్రులు ఉండటం ఏపీ ప్రజల దురదృష్టం. చంద్రబాబుని తిడితే.. జగన్ దగ్గర మార్కులు పడుతున్నాయనే భ్రమలో నాని ఉన్నారు. నాని పాపాల చిట్టాను ప్రతి టీడీపీ కార్యకర్త రాస్తున్నాడు. సమయం వచ్చినప్పుడు నానికి తగిన బుద్ది చెప్పే రోజు వస్తుంది. కొడాలి నాని మాట్లాడే నీ ప్రతి మాట నాశనానికి నాంది అన్నారు బుద్దా వెంకన్న.