ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ వార్ నడుస్తోందా? టీడీపీ నేతల వరుస అరెస్ట్ లు దానికి సంకేతమా? అంటే అవుననే అనిపిస్తోంది. కడప, అనంతపురం పర్యటనల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు టీడీపీ నేతల్ని వేధించడంపై మండిపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా విజయవాడ శివారులో టీడీపీ నేతను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. గొల్లపూడిలో టీడీపీ నాయకుడు ఆలూరి హరికృష్ణ చౌదరి చిన్నాను అరెస్ట్ చేశారు పోలీసులు. శుక్రవారం అర్ధరాత్రి చిన్నాని అరెస్ట్ చేసి వన్ టౌన్…
అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు అని మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అధికారం లేకపోతే చంద్రబాబు పిచ్చెక్కిపోతాడని ఆరోపించారు. ఆయన జిమ్మిక్కులను నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఎద్దేవా చేశారు. అవకాశం దొరికితే దేశాన్ని నాశనం చేయగలిగే సత్తా ఉన్న వ్యక్తి చంద్రబాబు అని.. అసలు రాయలసీమకు ఆయన ఏం చేశారో చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. 151 సీట్లు తెచ్చుకున్న వ్యక్తి సీఎం పదవికి అనర్హుడట……
ఏపీలో టీడీపీ కుదేలైపోయిందని, ఫ్యాన్ గాలికి కొట్టుకుపోవడం గ్యారంటీ అన్నారు ఏపీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్. అచ్చెన్నాయుడు ఏ గాలి పార్టీలో ఉన్నాడు.. మాది గాలి పార్టీనో.. మంచి పార్టీనో.. మా ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నామో..అచ్చెన్నాయుడుకి ఆయన గురువుకి బాగా తెలుసు. టీడీపీ రాష్ట్రంలో పూర్తిగా కుదేలైపోయింది.. వాళ్ళేదైనా మాట్లాడుతారు.. రాష్ట్రంలో భావి తరాల భవిష్యత్తు కోసం స్ట్రెయిట్ లైన్ లో వెళ్తున్నాం. మా నాయకుడు బ్రహ్మాండమైన పరిపాలన చేస్తున్నాడు. రాష్ట్రంలో సామాజిక విప్లవానికి…
ఏపీలో మోటార్లకు మీటర్ల బిగింపు వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. కేంద్రం నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు బిగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగింపును వ్యతిరేకిస్తూ అనంతపురంలో సీపీఐ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. గాంధీ సర్కిల్ నుంచి పవర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా ఎద్దుల బండిలో రైతులు ఉరికి వేలాడుతూ నిరసన తెలిపారు. ఎద్దుల బండిని తోలారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రభుత్వం తీరుపై…
కర్నూలు జిల్లా పర్యటనలో సీఎం జగన్పై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యకర్తలతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో విధ్వంస పాలన జరుగుతోందని మండిపడ్డారు. తాను తప్పు చేయనని.. నిప్పులాంటి మనిషినని.. ఎవరెన్ని కుట్రలు చేసినా తననేమీ చేయలేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాను కన్నెర్ర చేస్తే సీఎం జగన్ తట్టుకోలేరని హెచ్చరించారు. జగన్ పాలనలో ప్రజలకు వేధింపులు, అప్పులు, బాదుడే బాదుడు తప్పడం లేదని ఎద్దేవా చేశారు. Somu…
చంద్రబాబు నన్ను బలిపశువును చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీద మస్తాన్ రావు.. ఏపీలో ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసిన సీఎం వైఎస్ జగన్.. బీద మస్తాన్ రావుకు కూడా అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.. ఇక, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన వైసీపీ రాజ్యసభ అభ్యర్థి బీద మస్తాన్ రావు… పెద్దల సభకు ముఖ్యమంత్రి జగన్ నన్ను పంపించటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు.. జాతీయ స్థాయిలో వెళ్లటం అరుదైన అవకాశంగా…
క్విట్ చంద్రబాబు… సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో 2024 ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు ఏపీ మంత్రి ఆర్కే రోజా.. ఇవాళ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రులు అంబటి రాంబాబు, రోజా, ఉషశ్రీ, ఎంపీలు గురుమూర్తి, కృష్ణదేవారయులు.. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి రోజా… కడప వేదికగా అభివృద్ధి, సీఎం వైఎస్ జగన్పై చంద్రబాబు చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు.. కడపలో చంద్రబాబు చేసిన విమర్శలు హస్యాస్పదమన్న ఆమె.. కుప్పంలో జరిగిన అభివృద్ది, పులివేందులలో జరిగిన అభివృద్దిని పరిశీలించాలని…
కొన్నిరోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. తాజాగా ఆయన కడప జిల్లాలో రోడ్ షో నిర్వహించారు. సీఎం జగన్కు కంచుకోటగా చెప్పుకునే కడపలో టీడీపీ నిర్వహించిన రోడ్ షోకు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శల వర్షం కురిపించారు. నియంత పాలన సాగిస్తున్న జగన్ను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాను రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం…