ఏపీలో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమవుతోందా? జగన్ ముందస్తుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రతిపక్షాలకు చిక్కకుండా ఉండేందుకు రెండు అడుగులు ముందే ఉండాలని.. రెండేళ్ల ముందే ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారా? జగన్ ముందస్తు ఎన్నికల ప్రిపరేషన్ చేస్తున్నారంటూ టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందా? ప్రభుత్వ పని అయిపోయింది కాబట్టే ముందస్తుకు ప్లాన్ వేస్తున్నారనే కృత్రిమ చర్చకు శ్రీకారం చుడుతున్నారా? అసలు ముందస్తుతో మాకేం పనంటున్న అధికార పార్టీది నిజంగా ధీమానేనా? అంతర్గతంగా రెఢీ అవుతోందా? ఏపీలో అసలేం జరుగుతోంది? ఇంకా…
ఏపీలో తాజాగా నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా అందులో రెండు స్థానాలను బీసీలకు కేటాయిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ బీసీల పక్షపాతి అని.. అందుకే నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండు పదవులను బీసీలకు కట్టబెట్టారని వ్యాఖ్యానించారు. ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్ రావులకు రాజ్యసభ పదవులు కట్టబెట్టడం అభినందనీయమన్నారు. Andhra…
ఏపీలో అధికార, ప్రతిక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. ఎవ్వరూ తగ్గకుండా పోటీపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు.. వాతారణం చూస్తుంటే.. అప్పుడు ఎన్నికలు వస్తాయా? అనే అనుమానాలు కలిగిస్తోంది.. గత కొంత కాలంగా చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు.. అక్క ఆరాటమే తప్ప బావ బతకడు.. అంటూ సెటైర్లు వేశారు. కొన్ని పత్రికల ఆరాటమే తప్ప చంద్రబాబు రాజకీయంగా బతకరని జోస్యం చెప్పారు.. చంద్రబాబు పగటి కలలు కంటున్నారు.. కానీ, షెడ్యూల్ ప్రకారమే…
ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన ధరలకు నిరసనగా బాదుడే బాదుడు పేరుతో వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ.. అందులో భాగంగా.. అన్ని జిల్లాలను చుట్టేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయు.. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించి.. నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. ఇవాళ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు.. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు కడప జిల్లా టూర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే.. * ఈరోజు ఉదయం 10.30 గంటలకు కడప…
తెలుగుదేశం పార్టీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాదుడే బాదుడు, మెంబర్ షిప్, ఓటర్ వెరిఫికేషన్, మహానాడుపై సమీక్ష జరిపారు. ముందస్తు ఎన్నికల ప్రస్తావనపై చర్చించారు చంద్రబాబు. ముందస్తు ఎన్నికలు వచ్చినా పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో రోజు రోజుకూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందన్నారు. ప్రభుత్వాన్ని ఎంతో కాలం నడపలేమని సీఎం జగన్‌కూ అర్థమవుతోంది. జగన్ ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు కూడా బూటకమేనని ప్రజలకూ…
వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ కేంద్రమంత్రి కోట్లసూర్యప్రకాష్ రెడ్డి. కర్నూలు జిల్లా కోడుమూరులో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గడప గడపకు వెళ్లే ధైర్యం లేక.. పోలీసుల సాయం తీసుకుంటున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చేందుకు ముద్దులు పెట్టాడు..ఇపుడు గుద్దులు గుద్దుతున్నాడని విమర్శించారు. ప్రభుత్వం చేసింది శూన్యం.. అనే కార్యక్రమాన్ని ప్రతి ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ వైఫల్యం గురించి చెబుతాం అన్నారు. వేదవతి, ఆర్డీఎస్, గుండ్రేవుల ప్రాజెక్టు పనులను టీడీపీ…
తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అన్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. జూన్ నెల రాకముందే.. వ్యవసాయ పనులు మొదలు కాకముందే ఖరీఫ్ పంట కి వైఎస్సార్ రైతు భరోసా అందించడం సంతోషంగా వుంది. రైతు బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నారు. క్రమం తప్పకుండా వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం అమలు చేస్తున్నాం అన్నారు. మూడేళ్లలో ఎక్కడా కరువు లేదు.. ఒక్కమండలం కూడా కరువు మండలం గా ప్రకటించలేదు.…
ఏలూరు జిల్లా పర్యటనలో వున్నారు సీఎం జగన్. గణపవరం లో వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ కార్యక్రమం లో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ రైతు భరోసా నిధులు విడుదల చేశారు.
తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం డిప్యూటీ సీఎం నారాయణస్వామి దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకోగా.. వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం డిప్యూటీ సీఎం నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు. జగన్ భగవద్గీత, బైబిల్, ఖురాన్ చదివాడని.. అందుకే ఆయన అన్ని మతాల వారిని సమానంగా చూస్తాడని కొనియాడారు. Andhra Pradesh: రేపు ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన గడప…
తన సొంత నియోజకవర్గంలో కుప్పంలో ఇల్లు నిర్మించుకునేందుకు సిద్ధం అవుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇటీవలే మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించిన ఆయన.. కుప్పంలో ఇల్లు కడుతున్నా.. ప్రతీ మూడు నెలలకు నియోజకవర్గంలో పర్యటన ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇక, కుప్పం-పలమనేరు జాతీయ రహదారి సమీపంలో శాంతిపురం మండల పరిధిలోని కడపల్లె, కనమలదొడ్డి గ్రామాల మధ్య శివపురం దగ్గర చంద్రబాబు ఇల్లు కోసం స్థలం తీసుకున్నారని.. త్వరలోనే భూమి పూజలు చేసి.. నిర్మాణ…