ఏపీలో జగన్ పాలనపై మహానాడు వేదికగా టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మహానాడు 2022లో భాగంగా ప్రకాశం జిల్లాలో జరుగుతున్న సమావేశంలో ప్రజాస్వామిక వ్యవస్థల విధ్వంసంపై తీర్మానం ప్రవేశపెట్టారు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి. సీఎం జగనుపై సీరియస్ కామెంట్లు చేశారు సోమిరెడ్డి. వ్యవస్థలపై సీఎం జగనుకు నమ్మకం లేదు. పరిపాలనా వ్యవస్థను జగన్ భ్రష్టుపట్టించారు…. తన తండ్రి హయాంలో జగన్ చేసిన అవినీతికి ఐఏఎస్సులు జైళ్ల పాలయ్యారు. సీఎం హోదాలో ఉన్న జగన్ మాటను…
ప్రకాశం జిల్లాలో టీడీపీ మహానాడు కొనసాగుతోంది. మహానాడులో వివిధ అంశాలపై తీర్మానాలను ప్రవేశపెడుతున్నారు నేతలు. ఇప్పటి వరకు నాలుగు తీర్మానాలను మహానాడులో ప్రవేశపెట్టారు నేతలు. కార్యకర్తలపై ప్రభుత్వ వేధింపులు, బాదుడే బాదుడు, సంక్షేమ పథకాల్లో మోసం, కష్టాల కడలిలో సేద్యం అంశాలపై తీర్మానాలకు మహానాడు ఆమోదం తెలిపింది. కష్టాలల కడలిలో సేద్యం.. దగాపడుతున్న రైతన్న అంశంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ధూళిపాళ నరేంద్ర. వైసీపీ పాలనలో రాష్ట్ర రైతాంగ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయిందన్నారు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర.…
టీడీపీ మహానాడులో వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఏపీలో ఉన్మాది పాలన కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. చేతకాని పాలన వల్ల ఏపీ పరువుపోయిందన్నారు. అటు మూడేళ్లుగా తమ నేతలను, కార్యకర్తలను ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ఎంతోమంది టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తే తాను నిద్రలేని రాత్రులు గడిపానన్నారు. అనవసరంగా ఉన్మాది చేతిలో బలికావొద్దని కార్యకర్తలకు చంద్రబాబు సూచించారు. ఏపీలో పోలీసుల్లో మార్పు రావాలని… వాళ్ల లాఠీదెబ్బలకు ఇక్కడ ఎవరూ భయపడరని చంద్రబాబు హెచ్చరించారు.…
ఒంగోలు సమీపంలోని మండువారిపాలెం వద్ద టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మూడేళ్ల తర్వాత టీడీపీ మహానాడు జరుగుతోంది. ఈ మేరకు ఉదయం 8:30 గంటలకు ప్రతినిధుల నమోదుతో మహానాడును అట్టహాసంగా ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు ఫోటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాన్ని పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. ఉదయం 10:15 గంటలకు వేదికపై మహానాడు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తొలుత టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, పార్టీ జెండా ఆవిష్కరించారు. కాగా మహానాడు…
శుక్రవారం నుంచి టీడీపీ మహానాడు ప్రారంభం కానుంది. ఒంగోలు సమీపంలో జరిగే ఈ కార్యక్రమానికి టీడీపీ సర్వం సిద్ధం చేసింది. మహానాడులో పాల్గొనేందుకు పార్టీ కార్యకర్తలు భారీగా తరలివెళ్తున్నారు. అన్ని జిల్లాల నుంచి ముఖ్య నేతలు, కార్యకర్తలు ఒంగోలు బాట పట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి 10 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మహానాడులో పాల్గొనేందుకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఒంగోలు చేరుకున్నారు. మంగళగిరి నుంచి ఆయన…
పల్నాడు జిల్లాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోనసీమ ఘటన చాలా దురదృష్టకరమని.. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందరు అసాంఘిక, సంఘ విద్రోహుల కారణంగా హింసాత్మక ఘటనలు జరిగాయని కొడాలి నాని ఆరోపించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌పై కొడాలి నాని ఫైర్ అయ్యారు. అమలాపురంలో పిల్లలను రెచ్చగొట్టి ఆయన పబ్బం గడుపుకుంటున్నారని విమర్శలు చేశారు.…
వైసీపీ చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీపై చంద్రబాబు అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని. . ప్రజలంతా క్విట్ చంద్రబాబు, క్విట్ తెలుగు దేశం అంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ జవసత్వాలు అయిపోయాయని ఆరోపించారు. చంద్రబాబు 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో తనది అనుకున్న ఒక్క కార్యక్రమమైనా ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉంటే…
అమలాపురం అల్లర్లపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. చిలకలూరిపేటలో ఆయన మాట్లాడుతూ.. అందమైన కోనసీమలో చిచ్చుపెట్టిన ఘనత వైసీపీదే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమను వైసీపీ మనుషులే తగులబెట్టారని ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే మంత్రి ఇంటిపై దాడి చేశారన్నారు. మంత్రి ఇంటికి అంటుకున్న మంటలను అదుపు చేసేందుకు ఫైరింజన్ కూడా రాలేదని చంద్రబాబు విమర్శలు చేశారు. వైసీపీ వాళ్ల ఇళ్లను వాళ్లే తగులపెట్టుకుని వేరే వాళ్లపై నిందలేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తప్పులు చేసి.. ఆ నేరాన్ని…
హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అంటే అందరికీ టీడీపీ అధినేత చంద్రబాబే గుర్తొస్తారు. ముంబై లేదా బెంగళూరులో ఏర్పాటు అవుతుందనుకున్న ఐఎస్బీని చంద్రబాబు హైదరాబాద్ తీసుకువచ్చారు. 2001లో టీడీపీ హయాంలోనే ఐఎస్బీ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఐఎస్బీ 20వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు కూడా ఐఎస్బీ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్లో వరుసగా 17…