అనకాపల్లిలో జరిగిన మినీ మహానాడులో టీడీపీ సీనియర్ నాయకులు అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోసపూరిత సంక్షేమ పథకాల హామీలు విని జగన్ కు ఓటేసి గెలిపించారని, అమ్మఒడి అన్నాడు ఇప్పుడు ఏం చేశాడు 75 శాతం హాజరు ఉండాలి రూ.300 లోపు కరెంటు బిల్లు ఉండాలి అంటూ షరతులు పెట్టి పేర్లు తొలగించాడంటూ ఆయన విమర్శలు గుప్పించారు. దొంగలను పట్టుకోవలసిన పోలీసులు దొంగకు కాపలా కాయడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న ఖర్మ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. గడిచిన మూడు సంవత్సరాల్లో ఎనిమిది వందలు మంది ఆడవాళ్లపై అత్యాచారాలు జరిగాయని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిర్వీర్యమై పోయిందన్నారు. అనకాపల్లిలో షుగర్ ఫ్యాక్టరీ ని తెరిపించలేని మంత్రి దావోస్ వెళ్లి పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొస్తాను అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు అయ్యన్న.
350 కోట్ల విలువైన తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ స్థలాన్ని 10 ఎకరాలు కలెక్టర్ కార్యాలయానికి కేటాయించి మిగతాది అమ్ముకోవడానికి చూస్తున్నారన్నా అయ్యన్న పాత్రుడు.. కడప నుండి లీజు దారుల పేరుతో వచ్చి ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టమొచ్చినట్టు కొండలను నువ్వు పోతుంటే పోలీస్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తుందని ప్రశ్నించారు. సజ్జల రామకృష్ణా రెడ్డి అనే దౌర్భాగ్యుడు గతంలో సాక్షిలో రిపోర్టర్ ఈరోజు ముఖ్యమంత్రికి సలహాదారుడు అంటూ ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో దౌర్భాగ్యమైన ప్రభుత్వం నడుస్తుందని, 30 కోట్లు ఖర్చుపెట్టి దావోస్ ఎందుకు వెళ్లారో లండన్ లో ఎందుకు దిగారు అర్థం కావడం లేదు భార్యను తీసుకొని విహారానికి వెళ్ళినట్లు ఉందని ఆయన మండిపడ్డారు.