టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు మంత్రి దాడిశెట్టి రాజా.. తునిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గ్రౌండ్ రియాలిటీ చంద్రబాబుకు అర్థమైపోయింది.. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టాడని విమర్శలు గుప్పించారు.. చంద్రబాబు మాటలు ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్న ఆయన.. అబద్దాలు చెప్పి 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాడని ఆరోపించారు.. పోలవరం దగ్గర చంద్రబాబు డ్రామా చేశాడని మండిపడ్డారు.. పట్టి సీమ పేరుతో దోచుకున్నారు అని ఆరోపణలు గుప్పించారు. ఇక, పోలవరం ప్రాజెక్టు వైఎస్…
Perni Nani: టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ను మోసం చేశాడు కాబట్టే.. చంద్రబాబుకు తిరుమల వెంకటేశ్వరస్వామి శాపం పెట్టాడని ఆరోపించారు. తన కొడుకు వయసులో ఉన్న జగన్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడి మానసికంగా చంద్రబాబు క్షోభ పడేలా దేవుడు చేశాడని వ్యాఖ్యానించారు. ఇటీవల చంద్రబాబు తనకు ఇవే చివరి ఎన్నికలు అన్నాడని.. ఇప్పుడు పోలవరం వెళ్లి ప్రజలకు ఇవే చివరి ఎన్నికలు అంటున్నాడని పేర్ని నాని…
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు సెటైరికల్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు చేపట్టిన కార్యక్రమానికి "ఇదేమీ ఖర్మ తెలుగు దేశానికి.." అనేది సరిగ్గా సరిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల్లో స్పందన కరువైందని చంద్రబాబుకు అర్థం అయ్యిందన్నారు.
తనను, లోకేష్ను చంపేస్తారట అంటూ మాట్లాడిన చంద్రబాబు మాటలకు రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాటికి కాలు చాచిన చంద్రబాబును చంపే అవసరం ఎవరికీ లేదని ఆయన అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే 150 హత్యలు జరిగాయని ఎమ్మెల్యే ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. ఓవైపు మంత్రులు, వైసీపీ నేతలు.. మరోవైపు విపక్షాలకు చెందిన నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి జోగి రమేష్.. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొవడానికి చంద్రబాబుకి దమ్ములేదన్నారు.. ఇక, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు 86 నియోజకవర్గాల్లో అసలు తెలుగుదేశం…
ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయిలో తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి.." కార్యక్రమం ప్రారంభిస్తామని టీడీపీ అంటే లండన్ బాబు దెందులూరులో హడావిడి చేశారన్నారు.
TDP Vs YCP: ఏపీలో టీడీపీ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాదుడే బాదుడు తరహాలో ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ అనే పేరుతో మరో కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహాలను సిద్ధం చేసింది. ఈ మేరకు ఏలూరు జిల్లాలో బుధవారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. అయితే చంద్రబాబు పర్యటనకు ముందే వైసీపీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. దీంతో ఏలూరు జిల్లాలో టీడీపీ, వైసీపీల మధ్య ఫ్లెక్సీ వార్ మొదలైంది. చంద్రబాబు పర్యటన సందర్భంగా…