పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ వైసీపీ నేతలపై మండిపడ్డారు. వైఎస్ ఆర్ పార్టీ కర్నూలు లో జరిపిన సభలో వేదికపై నాయకుల హడావిడి తప్ప కింద ప్రజల హడావుడి కనిపించలేదు. పోలీసులు గేట్లు వేసినా జనం తోసుకొని బయటికి వెళ్ళారు. రాయల సీమ జనం నాడి ఇవాళ మంత్రులకు, ఎం ఎల్ ఏ లకి అర్థం అయిందన్నారు. మూడు సీట్లు మినహా మొత్తం గత ఎన్నికల్లో వైఎస్ అర్ పార్టీకి ఇస్తే ఏవిధంగా చేశారో చూస్తున్నాం. రాయలసీమ ప్రాజెక్టుల విషయం లో ఎన్ టీ ఆర్ కి ముందు తర్వాత అని చెప్పాలి వస్తుంది.
ఎవరికి ఊహకు అందని విధంగా గాలేరీ నగరి, హంద్రీనీవా వంటివి ఆయన మనసు లో నుంచి వచ్చాయి.మూడున్నర ఏళ్ల లో హైకోర్టు కర్నూలు లో పెట్టాలంటే ఎవరు వద్దన్నారు. అడగాల్సిన ది రాష్ట్ర ప్రభుత్వం… ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం అన్నారు పయ్యావుల, కేవలం చంద్రబాబుని తిట్టడానికి కార్యక్రమం చేపట్టారు. రాయలసీమకు కావాల్సింది నిధులు, నీళ్ళు, నియామకాలు. రాయలసీమ లో నిర్మాణం లో ఉన్న ప్రాజెక్టులు అడ్డుకున్నది… పరిశ్రమ లను తరిమేసింది మీరు కాదా? అన్నారు.రాయలసీమ కు ద్రోహం చేసింది వైఎస్ ఆర్ పార్టీ, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే అన్నారు పయ్యావుల.
ఈ ప్రాంతానికి కేంద్రం ఇచ్చిన నిధులు, సర్పంచుల నిధులు కాజేసింది ఈ ప్రభుత్వం.డ్రిప్, ప్రాజెక్టు ల నిర్మాణం చేయకుండా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి.అవగాహన లేకుండా పట్టిసీమ ను ప్రాయలసీమ లో కటాలి అంటున్నారు. గత ప్రభుత్వం లో రాయలసీమ ప్రాజెక్ట్ లకి ఎంత ఖర్చు చేశాం. మూడున్నర ఏళ్లలో ఎంత ఖర్చు చేశారు గర్జన లో చెప్పాల్సింది. రాయలసీమ నేతలు నిధుల కోసం అంతర్గతంగా గర్చించాలి. ముఖ్యమంత్రి ఢిల్లీ లో గర్జించాలి. తెలంగాణ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే అక్కడ మౌనంగా ఉన్నారు. హైకోర్టు విషయం లో సాక్షాత్తు ప్రభుత్వం పెట్టిన అడ్వకేట్ వేణుగోపాల్ అమరావతి లో హైకోర్టు ఉండాలి అన్నారు. ఇక్కడ గర్జనలు ఎంటి… ఎవరిని మోసం చేయాలని ఇక్కడ గర్జన.
Read Also: Indian States Going Bankrupt: మన దేశంలోని కొన్ని రాష్ట్రాలు.. మినీ శ్రీలంకలు కానున్నాయా?
ప్రజలను మోసం చేయడానికి పెట్టిన సభ ఇది. అనంతపురం అమరావతి ఎక్స్ ప్రెస్ గా ఉన్న దానిని కడప అమరావతి ఎక్స్ ప్రెస్ గా మార్చారు. ఆర్ టీ పీ పీ గతం లో ఎన్ టీ ఆర్ నిర్మించారు.. చంద్రబాబు విస్తరించారు. జగన్ ప్రభుత్వం లో మూసివేత దిశగా ఉంది. రాయలసీమకు చెందిన అమర రాజా పరిశ్రమను తరిమేశారు. మూడ్ ఆఫ్ ది రాయలసీమ పేరుతో చేపట్టిన సర్వే లో ప్రభుత్వం వైఖరి స్పష్టం అయితే సెంటిమెంట్ రగిలించెందుకే ఏర్పాటుకు గర్జన చేశారు. ఇక మనం చూడబోయేది ముందస్తు ఎన్నికలు మాత్రమే. ప్రభుత్వ అస్తితం కాపాడుకోవడానికి ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారు అన్నది సత్యం అన్నారాయన.
Read Also: Muslims Boycott Elections: ఎన్నికలను బహిష్కరించిన ముస్లింలు.. కారణం ఇదే..