ఢిల్లీలో టీడీపీ పార్లమెంటరి పార్టీ మీటింగ్ ముగిసింది. శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. ప్రధాని ఆహ్వానం మేరకు జి20 సన్నాహక సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారన్నారు. టీడీపీ ఎంపీలతో బాబు భేటీ అయ్యారు. రాష్ట్ర హక్కులు కేంద్రం నుంచి సాధించటంలో వైసిపి విఫలం అయిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కేంద్రం వద్ద వైసిపి తాకట్టు పెట్టిందన్నారు.
Read Also: Indian States Going Bankrupt: మన దేశంలోని కొన్ని రాష్ట్రాలు.. మినీ శ్రీలంకలు కానున్నాయా?
ప్రత్యేక హోదాతో పాటూ ఇతర అంశాలపై పార్లమెంట్ లో లెవనెత్తుతాం అన్నారు రామ్మోహన్ నాయుడు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. రాష్ట్రంలో మమ్మల్ని మాట్లాడనివ్వటం లేదు. తప్పుడు కేసులు పెడుతున్నారు. అందుకే మా హక్కులను పార్లమెంట్ వేదికగా ఉపయోగించుకుంటాం. రాష్ట్రంలో frbm లిమిట్ ను దాటి అప్పులు తెస్తున్నారు.
రాజీనామాలకు టిడిపి ఎంపిలు ఎప్పుడో సిద్ధంగా ఉన్నారన్నారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఈపార్లమెంటరీ సమావేశంలో ఎంపీలు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, కేశినేని నాని, కనకమేడల రవీందర్ కుమార్ పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. టిడిపి పార్లమెంటరి పార్టీ భేటీకి ముందు చంద్రబాబు, టిడిపి ఎంపిలను కలిశారు వైసిపి ఎంపీ రఘురాకృష్ణరాజు. వైఎస్ జగన్ గతంలో పార్లమెంట్ ఆఖరి రోజు అందరూ రాజీనామాలు చేసి విభజన హామీల అమలు కోసం కేంద్రం పై ఒత్తిడి చేద్దామని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం నేను రాజీనామాకీ సిద్ధంగా ఉన్నా…ముగ్గురు టిడిపి ఎంపీలను రాజీనామా కోసం ఒప్పించడానికి వచ్చానన్నారు రఘురామ. ప్రస్తుతం టిడిపి పార్లమెంటరి పార్టీ సమావేశం జరుగుతుంది కాబట్టి నా విషయం చెప్పి బయటకి వచ్చానన్నారు.
Read also: Top Headlines @5 PM: టాప్ న్యూస్