Ambati Rambabu: ఏపీలో వికేంద్రీకరణపై మంత్రి అంబటి రాంబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకణ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను తాను దగ్గరగా చూశానని.. సీఎం జగన్ తీసుకువచ్చిన మార్పులు ఎవ్వరి వల్ల సాధ్యం కాలేదన్నారు. ఆఖరి ఛాన్స్ అని చంద్రబాబు ప్రజలను బెదిరిస్తున్నారని.. ఆఖరి ఛాన్స్ అంటే అధికారం రాదని.. ప్రజల మెప్పు పొందితేనే…
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి.. సీఎంగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. పార్టీలో కీలకంగా పనిచేసిన నేతలు టీడీపీకి గుడ్‌బై చెబుతూనే ఉన్నారు.. ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు కూడా టీడీపీకి రాజీనామా చేసి.. స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే, పార్టీ సీనియర్ నేత, చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించిన గంటా శ్రీనివాసరావు కూడా టీడీపీని వీడేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది..…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించిన మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి.. అదే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు సందించారు.. భూ సర్వే చారిత్రాత్మ క నిర్ణయమన్న ఆయన.. సీఎం వైఎస్ జగన్ గొప్ప మనసుతో భూ సర్వేకి శ్రీకారం చుట్టారు.. దేశంలో ఇది ఒక ఆదర్శమైన నిర్ణయం.. భూ సర్వేలో ఆంధ్రప్రదేశ్ ను భారతదేశంలోనే మొదటి స్థానంలో ముఖ్యమంత్రి జగనన్న నిలిపారని పేర్కొన్నారు.. కానీ, మీ భూములను లాక్కుంటున్నారని, గోల్ మాల్ చేస్తారని ప్రతిపక్షాలు…
అవకాశం దొరికితే.. టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. ఆయన కుమారుడు నారా లోకేష్‌పై సెటైర్లు వేయానికి సిద్ధంగా ఉంటారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి.. ఇప్పుడు మరోసారి నారా లోకేష్‌ను టార్గెట్ చేసిన ఆయన.. తాజాగా, లోకేష్ తీస్తున్న ఓ సెల్ఫీకి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పంచ్‌లు వేశారు.. ”ఇదేంటి బోకేష్! అక్కడ ఫోన్ ను తలకిందులు చేయాల్సిన అవసరం ఏంటి? ఫోన్ అంత ఎత్తులో పెడితే…