జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమలో వైసీపీ బలహీన పడిందని చెప్పడానికి ఇవాళ జరిగిన సభ నిదర్శనం అన్నారు. రాయలసీమ గర్జన సభ జరిగిన తీరు వైసీపీ క్షీణ దశను తెలియజేస్తోంది. రాయలసీమకు నిధులు, నీళ్ళు, నియామకాలు కావాలని ఇక్కడి వారు కోరుకుంటున్నారు. ఇక్కడ న్యాయ రాజధాని పెట్టడానికి మూడున్నరేళ్లుగా మీకున్న ఇబ్బంది ఏంటి? అధికారంలో ఉండి పని చేయాల్సిన వారు పోరాడతామని అనడం ఏంటి? అన్నారాయన.
Read Also: Tortoise 190th Birthday: ఘనంగా తాబేలు 190వ బర్త్ డే
ఈ సభకు సామాన్య జనం ఎవరు వెళ్లలేదు.. వెళ్లిన విద్యార్థులు కూడా మధ్యలోనే వచ్చేసారు. ఇది సీమ గర్జన కాదు… వైసీపీ గ్రామ సింహాల గర్జన. రాయలసీమలో ఒక్క ప్రాజెక్ట్ ముందుకు వెళ్లడం లేదు. రాయలసీమకు తీరని అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం.ఎస్కేయులో 60 ఏళ్ల కిందట ఏర్పాటైన లా విభాగాన్ని ఎత్తేశారు. న్యాయ విద్యను బోధించే అధ్యాపకులు లేరు అని ఈ విద్యా సంవత్సరంలో లా ప్రవేశాలు రద్దు చేశారు. న్యాయ విద్యను లేకుండా చేసి అనంతకు, సీమకు సీఎం తీరని అన్యాయం చేస్తున్నారు. ఇది పాలకుల అసమర్థత కాదా..! అని కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు.
ఇదిలా ఉంటే.. మూడు రాజధానులకు మద్దతుగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కర్నూలులోని ఎస్టీబీసీ డిగ్రీ కళాశాలలో నేడు రాయలసీమ సభ గర్జన సభ నిర్వహించారు. మేధావులు, న్యాయవాదులు, విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సభకు అధికార వైసీపీ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించింది. ఈ సభలో వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, రాయలసీమ నేతలు మాట్లాడారు. పాలనా వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యం అవుతుందని వైసీపీ నేతలు పునరరుద్ఘాటిస్తున్నారు.
Read Also: CPI Narayana: ఇదే జరగకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టులు ఉండేవారు.