Rayapati SambasivaRao: గుంటూరు జిల్లాలో టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో కష్టపడే వారికి టికెట్లు ఇవ్వాలని.. తమ కుటుంబంలో రెండు సీట్లు ఇవ్వాలని చంద్రబాబును అడిగామని.. దీనికి టీడీపీ అధిష్టానం సమాధానం చెప్పాలని రాయపాటి అన్నారు. సత్తెనపల్లి, పెదకూరపాడు, గుంటూరు పశ్చిమలో ఎక్కడ ఇచ్చినా తమ రాజకీయ వారసుడు రంగబాబు పోటీ చేస్తాడని రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు. నరసరావుపేట ఎంపీ సీటు కడప వాళ్లకు ఇస్తే ఓడిస్తామని హెచ్చరించారు.…
Chandra Babu: ఏపీలో జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 1 వివాదాస్పదంగా మారింది. ప్రతిపక్షాలు ఈ జీవోపై మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జీవోను హైకోర్టు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు తీర్పును నిలిపివేయాలంటూ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జీవో నెం.1పై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై టీడీపీ…