ఏపీలో పాదయాత్రల విషయంలో ఒకరినొకరు పోటీపడుతున్నారు. తాజాగా టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్రపై తనదైన రీతిలో స వేశారు మంత్రి సీదిరి అప్పలరాజు. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి మాట్లాడుతూ.. నడక చాలా మంచిది.. ముఖ్యంగా లోకేష్ లాంటి వ్యక్తులకు మరింత మంచిదని సలహా ఇచ్చారు. నడవడానికి పర్మిషన్లు అవసరం లేదు..నీవు నడవచ్చు లోకేష్.. నీ ఆరోగ్యం మెరుగు పరుచుకునే యాత్రకు యువగళం అనే పేరేందుకు…? లోకేష్ మీ నాన్న గారు యువకులకు చేసిన మోసం ..ఈ రాష్ట్రంలో ఏ యువకుడు మర్చి పోలేదు..?
బాబు వస్తే జాబు వస్తాదని అన్నావు.ఇంటికో ఉద్యోగం అన్నావు..ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు..? ఎన్ని కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయగలిగావు..? ముఖ్య మంత్రి యువ నేస్తం అని నిరుద్యోగులకు వెయ్యి రూపాయల చొప్పున ఇస్తానన్నావు.. ఎంతమందికి ఇచ్చావు..? మా నియోజకవర్గంలో 50 మందిని చూపించు . ముఖ్య మంత్రి యువ నేస్తం కాదిది…యువమోసం. మోసాల మీద వెన్నుపోట్ల మీద అధికారంలోకి వచ్చినటువంటి దౌర్భాగ్య చరిత్ర మీది. మీ నాన్నగారిది..అసెంబ్లీలో మాట్లాడటానికి గొంతు నొక్కే సారని మండిపడ్డారు.
Read Also: Ravindar Gopala: ‘దేశంకోసం భగత్ సింగ్` ఆడియో ఆవిష్కరణ!
ప్రజల కష్టాలు తెలుసుకోడానికి జగన్ బయటకు రావడం జరిగింది.. నీవు , నీ కొడుకు తలక్రిందులుగా తపస్సు చేసినా అధికారంలోకి రాలేరని బలంగా చెబుతున్నాను.. జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టను తగ్గించటానికి ప్రతి పక్షాలు రకరకాల జిమ్మిక్కులు, పగటి వేషాలు వేస్తున్నారు..మొన్నటి వరకు బాదుడే బాదుడని, మళ్లీ దారి పేరు మార్చి ఇదేం ఖర్మరా.. అని వస్తే ప్రజలు నిర్ద్వంద్వంగా తోచిపుచ్చారు.. పాదయాత్ర చేయడానికి రీజనేంటి…సమయం .. సందర్భం.. బలమైన కారణం ఉందా.? అని ప్రశ్నించారు.
కేవలం అధికార కాంక్ష, నీకోటరీలో నీకంటూ కోటరీ నిర్మించుకోవడం కోసం ..నీవు చేసిన యాత్రల వలన ప్రజలకు ఒరిగేదేమీ లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన, పారదర్శక పాలన ముందు ఎవరెన్ని వేషాలు, కుయుక్తులు పన్నినా పనికి రావు.. జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికీ శత శాతం న్యాయం చేయడానికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు మంత్రి అప్పలరాజు.
Read Also: Komatireddy Venkat Reddy : మీకు చదవాలని కోరిక ఉందా.. నేను చదివిస్తా