ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నేడు గాంధీ జయంతి సందర్భంగా అరెస్ట్‌కు వ్యతిరేకంగా టీడీపీ నేతలు ఒకరోజు నిరాహార దీక్షకు దిగుతున్నారు. చంద్రబాబు, నారా భువనేశ్వరి, లోకేశ్ సహా ప్రతి ఒక్కరూ దీక్షలో పాల్గొననున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అవినీతి జరిగింది అనే విషయం అందరికీ తెలిసిందే అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. అక్రమాలు జరగలేదని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు హడావిడి చేస్తూన్నారు.. టీడీపీ నేతలు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి వెళ్లి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు వెళ్లి అభాసు పాలయ్యారు
చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రేపు ( అక్టోబర్ 2 ) నారా భువనేశ్వరి నిరహార దీక్షకు దిగుతున్నారు. ఇక, అదే రోజు జైల్లోనే చంద్రబాబు సైతం నిరాహార దీక్ష చేయనున్నట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు.
చంద్రబాబు అవినీతి పాల్పడినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆధారాలతోనే సీఐడీ చంద్రబాను అరెస్ట్ చేసిందన్నారు. breaking news, latest news, telugu news, chandrababu, Anil Kumar Yadav