టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై మంత్రి మేరుగ నాగార్జున విరుచుకుపడ్డారు. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మహాత్ముడి జయంతిన దీక్ష చేస్తాడట.. ప్రజాస్వామ్యం, స్వాతంత్య్ర ఉద్యమం మీద అవగాహన ఉంటే ఇలాంటి పనులు చేయడంటూ మంత్రి వ్యాఖ్యానించారు.
చంద్రబాబు మెంటల్లీ సిక్ అని చెప్పి జైలుకు తీసుకువస్తావా పవన్? పోసాని కృష్ణమురళి అడిగారు. అసలేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా పవన్?.. కాపు నాయకుడ్ని, లెజెండ్ ని చంపిన దుర్మార్గుడ్ని జైలు నుంచి బయటకు తీసుకొస్తావా పవన్.. కాపు వ్యతిరేకి చంద్రబాబు.. మీరు ఎవర్నైనా ఎన్నుకోండి.. ఎవరికైనా ఓట్లు వేయండి కానీ చంద్రబాబుకు వేయకండి అని ఆయన కోరారు.
దీక్ష చేసే ముందు ఎంత వరకు మన అర్హత ఉందో చూసుకోవాలి అని స్పీకర్ తమ్మనేని సీతారం అన్నారు. నారా భువనేశ్వరి బస్సు యాత్ర కాకపొతే హెలికాప్టర్ యాత్ర చేసుకోమనండి.. అది వాళ్ళ ఇష్టం.. తప్పు చేసి మోసం చేయాలని చూస్తే ఊరుకునే పరిస్థితి లేదు అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆరు నెలలు ఓపిక పట్టండి.. ఎన్నికలలో ప్రజలు ఊహించనంత తీర్పు ఇస్తారు.
గాడ్సే కంటే ఘోరమైన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. గాంధీని అవమానించేందుకు ఆయన దీక్ష చేస్తున్నారు అంటూ ఆమె మండిపడ్డారు. దీన్ని మేము ఖండిస్తున్నాము.. ప్రజలు చంద్రబాబును తరిమికొట్టాలి..
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నేడు గాంధీ జయంతి సందర్భంగా అరెస్ట్కు వ్యతిరేకంగా టీడీపీ నేతలు ఒకరోజు నిరాహార దీక్షకు దిగుతున్నారు. చంద్రబాబు, నారా భువనేశ్వరి, లోకేశ్ సహా ప్రతి ఒక్కరూ దీక్షలో పాల్గొననున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అవినీతి జరిగింది అనే విషయం అందరికీ తెలిసిందే అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. అక్రమాలు జరగలేదని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు హడావిడి చేస్తూన్నారు.. టీడీపీ నేతలు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి వెళ్లి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు వెళ్లి అభాసు పాలయ్యారు
చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రేపు ( అక్టోబర్ 2 ) నారా భువనేశ్వరి నిరహార దీక్షకు దిగుతున్నారు. ఇక, అదే రోజు జైల్లోనే చంద్రబాబు సైతం నిరాహార దీక్ష చేయనున్నట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు.