టీడీపీ అధినేత చంద్రబాబు జైలు నుంచీ బయటకు వస్తారని ఆశిస్తున్నాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ ఒక లాల్ బహాదూర్ శాస్త్రి, వాజ్ పేయి అయితే నేను ఇలా మాట్లాడను.. వచ్చే దశాబ్ద కాలం మనం కలిసి పనిచేయాలి అని టీడీపీకి చెపుతా.. 2009లో కోల్పోయిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను అని ఆయన పేర్కొన్నారు.
టీడీపీ బలహీన పడిందని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కి టీడీపీ వాళ్ళు ఒప్పుకున్నారా?.. టీడీపీ పార్టీ బలహీన పడిందని పవన్ అన్నారు.. టీడీపీని పవన్ టెకోవర్ చేస్తున్నారా?.. టీడీపీకి పవన్ ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పాలి అని సజ్జల డిమాండ్ చేశారు.
ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ.. ఎన్నికల వరకూ చంద్రబాబు జైల్లో ఉండాలనేది జగన్ తాపత్రయం.. అందుకే హడావుడిగా రేపు జగన్ ఢిల్లీ వెళ్తున్నారు అని ఆయన ఆరోపించారు.
చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు పూర్తైన తర్వాత ఏసీబీ కోర్టు గంట పాటు కేసును వాయిదా వేసింది. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించనున్నారు.