భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులంపై ఎంతంటే?
బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి సమయం అని చెప్పాలి. ఇటీవల పెరుగుతూ పోయిన పసిడి ధరలు దిగొస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గత పది రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. రూ. 200, 250, 600, 250, 300, 150, 600, 10, 190గా తగ్గింది. సెప్టెంబర్ 26న రూ. 54,750గా ఉన్న పసిడి ధరలు అక్టోబర్ 6న రూ. 52,400గా ఉంది. అంటే ఈ 8-10 రోజుల్లో రూ. 2000లకు పైగా తగ్గింది.
బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (అక్టోబర్ 6) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,160గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 190.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 210 తగ్గింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం నమోదైనవి. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
వామ్మో పామును ఎలా పట్టిందో చూడండి.. వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే..
ఈ భూ ప్రపంచంలో మనుషులు, జంతువులు కూడా పామును చూస్తే భయపడతాయి.. అది కరిస్తే వెంటనే చనిపోతారు అని పాము అక్కడెక్కడో వెళుతున్న ఇక్కడ జనాలు పరుగులు పెడతారు.. ఇక పామును పట్టుకోవడం అంటే ప్రాణాల మీద ఆశలు వదులుకున్నట్లే.. అయితే ఈ మధ్య పాములు, బైకులలో, షూలలో కనిపిస్తుండటం మనం చూస్తూనే ఉంటాం.. తాజాగా ఓ పాము షూలో ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
పాము రక్షకురాలిగా చెప్పుకునే ఆర్తి అనే మహిళ ఈ వీడియోను పోస్ట్ చేసింది. గత నెలలో పోస్ట్ చేయబడిన క్లిప్, లెదర్ షూ లోపల ఒక చిన్న పామును చూపిస్తుంది. మొదటి చూపులో, పాము లోపలికి పాకడం మరియు అస్పష్టంగా ఉండటంతో అస్సలు కనిపించలేదు. మహిళ షూ తీయగా, మరోవైపు పాము కనిపించింది. షూస్ వేసుకునే ముందు ఎప్పుడూ చెక్ చేసుకోవాలని ఆమె వీడియోలో సలహా ఇస్తున్నట్లు వినిపిస్తోంది. ఇది విషపూరితం కాని సాధారణ కుక్రి పాము అని ఆమె చెప్పింది..
రైతులకు సీఎం శుభవార్త.. నేటి నుండి సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల
నేటి నుండి సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని నాగార్జునసాగర్ ఆయకట్టు కింద సరైన వర్షాలు కురవకపోవడం వల్ల, వేసిన వరిచేను దెబ్బతినే ప్రమాదం ఉందని, ఆ ప్రాంతాల రైతాంగం, శాసనసభ్యులు, మంత్రులు గత నాలుగైదు రోజుల నుంచి ముఖ్యమంత్రి కి పలు విజ్ఞప్తులు చేస్తున్న నేపథ్యంలో… ఈరోజు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో సాగర్ ఎడమ కాలువ కింద వరి పంటలకు సాగునీరు అందించే విషయంపై చర్చ జరిగింది. తెలంగాణ వాటా కింద కృష్ణా జలాలలో మన నీరు ఉన్న నేపథ్యంలో.. నేటి నుండి నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఉన్న వరి పొలాలకు నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు.
పాపం డెవాన్ కాన్వే.. ఆ ఆనందంను 15 నిమిషాలు కూడా ఉంచని రచిన్ రవీంద్ర!
వన్డే ప్రపంచకప్ 2023 మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించి మెగా టోర్నీని ఘనంగా ఆరంభించింది. 283 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 36.2 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. డెవాన్ కాన్వే (152 నాటౌట్; 121 బంతుల్లో 19×4, 3×6), రచిన్ రవీంద్ర (123 నాటౌట్, 96 బంతుల్లో 11×4, 5×6) సెంచరీలతో చెలరేగిపోయారు.
బంతి బాగా తిరిగే అహ్మదాబాద్‌లో 283 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కివీస్‌కు అంత తేలిక కాదని అందరూ అనుకున్నారు. ముగ్గురు స్పిన్నర్లు ఆదిల్ రషీద్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టన్‌లు ఉండడమే కాక.. ఆరంభంలోనే విల్ యంగ్ (0) వికెట్ పడిపోయింది. దాంతో ఇక కివీస్ పని అయిపొయింది అనుకున్నారు. అయితే కివీస్ ఆశ్చర్యకరంగా స్పిన్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రను మూడో స్థానంలో దింపింది. రచిన్ ఇంగ్లిష్ బౌలింగ్‌కు పెద్ద షాకే ఇచ్చాడు. ఆరంభం నుంచే బౌలర్లపై ఎదురుదాడి చేసి.. పరుగుల వరద పారించాడు. డేవాన్ కాన్వే సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే.. రచిన్ ధనాధన్ సెంచరీ సాధించాడు.
పుంగనూరు అల్లర్లపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ
చిత్తూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు చంద్రబాబు వెళ్లిన సమయంలో ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. ఈ ఘర్షణలకు చంద్రబాబు కారణమని ఆరోపిస్తూ కేసులు నమోదయ్యాయి. చంద్రబాబుతో పాటు 20మంది టీడీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో ఘర్షణలు జరిగాయి. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమ, ఏ3గా అమర్నాథ్‌రెడ్డి, ఏ4గా రాంగోపాల్‌రెడ్డిని పేర్కొన్నారు. వైసీపీ నాయకుడు ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేశారు. అయితే.. ఈ నేపథ్యంలో పుంగనూరు ఆంగళ్లు కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరుగనుంది.
సింగరేణి కార్మికులకు దసరా బోనస్.. ఈనెల 16న ఖాతాల్లో 1.53 లక్షలు
సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. దసగ పండుగ సందర్భంగా భారీ బోనస్ ప్రకటించారు. ముందుగా చెప్పినట్లుగా, 2022-23 సంవత్సరంలో, కార్మికులకు గత సంవత్సరం లాభం కంటే 32 శాతం ఎక్కువ వాటా చెల్లించడానికి నిధులు విడుదల చేయబడ్డాయి. అయితే.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ.. సింగరేణి సంస్థ రికార్డు స్థాయిలో రూ.2,222 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఇందులో 32 శాతం దసరా బోనస్‌గా రూ. 711.18 కోట్లు. అయితే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు బోనస్ నిధులను విడుదల చేశారు. ఈ బోనస్ సొమ్మును ఈ నెల 16న సింగరేణి కార్మికుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
అయితే ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.53 లక్ష చొప్పున బోనస్ వస్తుందని అధికారులు అంచనా వేశారు. మరోవైపు పండుగ సందర్భంగా భారీ బోనస్ ప్రకటించడంతో సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 11వ వేతన ఒప్పందానికి సంబంధించి ప్రభుత్వం ఇటీవల కార్మికులకు 23 నెలల బకాయిలు చెల్లించింది. ఈ మేరకు ప్రభుత్వం దాదాపు రూ.1,450 కోట్లు చెల్లించింది. కాగా, మంచిర్యాల సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్ గతంలో ఎన్నడూ లేని విధంగా లాభాల్లో కార్మికులకు వాటా కల్పిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం.. గతంలో ఇచ్చిన షేర్ కంటే.. ఏకంగా 32 శాతం షేర్ ప్రకటించారు. దీంతో.. ఈ ఏడాది.. సింగరేణి కార్మికుల ముఖాల్లో రెట్టింపు ఆనందం వెల్లివిరుస్తోంది.
రవితేజ ఎదుగుదలకు ఇంతకన్నా నిదర్శనం ఏముంది…
మాస్ మహరాజ్ రవితేజ కెరీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన గురించి తెలిసిన వారు ఎవరైనా సరే అయన్ను చూసి స్పూర్తి పొందుతారు.ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరో గా ఎదిగి తానేంటో నిరూపించుకున్నారు.రవితేజ ఒకప్పుడు సైడ్ రోల్స్ చేసి ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేసి చిన్నగా హీరోగా మారి ఆ తర్వాత మాస్ మహరాజ్ గా ఫ్యాన్ బేస్ ని ఏర్పరచుకున్నారు.వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ప్రస్తుతం రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వర రావు. దసరా కి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయి లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ను హిందీ లో కూడా భారీగా ప్రమోట్ చేస్తున్నారు. టైగర్ నాగేశ్వర రావులో కీలక పాత్ర చేసిన అనుపం ఖేర్ రవితేజని హిందీ ఆడియన్స్ కు పరిచయం చేశారు.