Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 1pm 06 10 2023

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Published Date :October 6, 2023 , 1:00 pm
By Gogikar Sai Krishna
Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. క్రికెట్‌లో పతకం ఖాయం!

2023 ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. హాంగ్‌జౌలోని పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ మైదానంలో శుక్రవారం ఉదయం జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ నిర్దేశించిన 97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ 9.2 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. రుతురాజ్ గైక్వాడ్‌ (40) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. తిలక్‌ వర్మ (55) హాఫ్ సెంచరీ బాదాడు. ఈ విజయంతో భారత్‌కు క్రికెట్‌లో పతకం ఖాయం అయింది.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. నేపాల్‌పై సెంచరీ చేసిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. 4 బంతులు ఆడిన యశస్వి క్యాచ్ ఔట్ అయ్యాడు. ఈ దశలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు తెలుగు ఆటగాడు తిలక్‌ వర్మ జత కలిశాడు. ఇద్దరు కలిసి బౌండరీలు, సిక్సులు బాది స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. ముఖ్యంగా తిలక్‌ సిక్సులు వర్షం కురిపించాడు. దాంతో భారత్ సునాయాస విజయం అందుకుంది.

తెలంగాణలో వేడి వాతావరణం.. వచ్చే పది రోజులు పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు

తెలంగాణలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైంది. రుతుపవనాలు దాదాపు 2 వారాలు ఆలస్యంగా రాష్ట్రాన్ని ముంచెత్తాయి. జూన్ మొదటి వారంలో కురవాల్సిన వర్షాలు.. జూన్ 20 తర్వాత అడపాదడపా కురిశాయి. ఆ తర్వాత జూలై చివరి వారంలో వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జలాశయాలు జలమయమయ్యాయి. ములుగు జిల్లాల్లో కూడా వరదల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆగస్టులో మళ్లీ వరుణుడు ముఖం చూపించాడు. సెప్టెంబర్ నెలల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఈ నెల ప్రారంభంలో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వేడి వాతావరణం నెలకొంది. బంగాళాఖాతంలో గంటకు 17 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

కన్నప్పలో “శివుడు” ఇలా ఉంటే థియేటర్లు టెంపుల్స్ గా మారిపోతాయి

ఈ జనరేషన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ సోషల్ మీడియాని రూల్ చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ చేస్తున్న సలార్ సినిమా ఫస్ట్ పార్టీ సీజ్ ఫైర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రభాస్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతూనే ఉన్నాడు. ప్రభాస్ ని సంబంధించిన న్యూస్, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ముఖ్యంగా AI టెక్నాలజీతో ప్రభాస్ ఫ్యాన్స్ చేస్తున్న ఎడిట్స్ చూస్తుంటే మెంటల్ ఎక్కి పోవడం గ్యారెంటీ. ప్రభాస్ ఫ్యాన్స్ చేస్తున్న ఎడిట్స్ లో ఒక్క లుక్ లో ప్రభాస్ కనిపించినా చాలు ఆ సినిమా ఇండియాని షేక్ చేయడం గ్యారెంటీ. లేటెస్ట్ గా AIని వాడుతూ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ ని ఏకంగా “శివుడి”గా మార్చేశారు.

కేసీఆర్‌ రంగారెడ్డి పర్యటన రద్దు..! సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ప్రారంభించిన మంత్రులు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉదయం ఈ పథకాన్ని ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సీఎం ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. ఈనేపథ్యంలో.. తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని మంత్రి హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఒక్కో నియోజకవర్గానికి 119 పాఠశాలల్లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో వైద్య, దేవాదాయ శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ముఖ్యమంత్రి బదులు మంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి, 40 మందికి గాయాలు..

ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.. గోరేగావ్‌ వెస్ట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏడు అంతస్తుల భవనంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు మరణించారు.. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.. ప్రమాదం నుంచి మరో 30 మంది సురక్షితంగా బయటపడినట్లు పోలీసులు తెలిపారు..

ఈ ఘోర అగ్ని ప్రమాదంలో అగ్ని ప్రమాదంలో మొత్తం 46 మంది గాయపడ్డారని బీఎంసీ తెలిపింది. ఆజాద్ మైదాన్ సమీపంలోని ఎంజీ రోడ్డులోని జే భవానీ భవనంలో తెల్ల వారుజామున 3 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం 6:54 గంటలకు మంటలు ఆర్పివేయబడ్డాయి. గాయపడిన వారిలో 25 మంది హెచ్‌బిటి ఆసుపత్రిలో చికిత్స పొందగా, మరో 15 మంది కూపర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు..

వరంగల్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. సిటీ బయటే భారీ వాహనాలు..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐటీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో హన్మకొండకు వెళ్లనున్నారు. హన్మకొండలో రూ.900 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మంత్రి కేటీఆర్ సభలను విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్ భారీ ఏర్పాట్లు చేశారు. మరోవైపు అధికారులు కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు నగరానికి విచ్చేస్తున్న మంత్రి కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో వరంగల్‌, హనుమకొండ, కాజీపేట పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏ.వి రంగనాథ్‌ తెలిపారు. ఈ ఆంక్షలు శుక్రవారం ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు.

మంత్రి రోజాకు మద్దతుగా నటి ఖుష్బూ

టీడీపీ నేత బండారు సత్యనారాయణ మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే.. మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేసిన కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. అయితే.. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు బండారు సత్యనారాయణ వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే.. ఈ క్రమంలోనే.. మంత్రి రోజా పై టీడీపీ నేత బండారు సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలపై సినీ నటి ఖుష్బూ స్పందించారు.

నేడు బీఆర్‌ఎస్‌కు రేఖా నాయక్ రాజీనామా..! ఇండిపెండెంట్ గా పోటీ..?

నేడు బీఆర్ఎస్ కు ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ రాజీనామా చేయనున్నారు. మరో సారి పోటీ చేసేందుకు బీఆర్ఎస్ అధిష్ఠానం టికెట్ నిరాకరించడంతో నిరసచెందిన రేఖనాయక్ బీఆర్ఎస్ కు రాజీనామా చేయనున్నారు. టికెట్ల ప్రకటన విడుదల చేసిన అప్పటి నుంచి అధిష్ఠానం పై ఎమ్మెల్యే గుర్రుగా ఉన్నట్లు సమాచారం. నిధుల మంజూరు నిలిపివేశారంటూ పలు మార్లు అధిష్ఠానంపై రేఖా నాయక్ ఆరోపణలు చేసిన విషయం తెలసిందే.. దీంతో ఇవాళ రేఖా నాయక్ బీఆర్ఎస్ కు రాజీనామా చేయనున్నారు. ఈ విషయంపై ఖానాపూర్ లో ఎమ్మెల్యే రేఖా నాయక్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో బీఆర్ఎస్ కు రాజీనామా చేయనున్నట్లు మీడియా ద్వారా రేఖనాయక్ ప్రకటించనున్నారు. ఏ పార్టీలోకైనా వెళ్తారా? ఇండిపెండెంట్ గా బరిలో నిలుస్తారా? అనే దానిపై రేఖా నాయక్ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే రేఖా నాయక్.. భర్త శ్యాం నాయక్ కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే..

తోలు తీస్తా, బట్టలూడదీస్తా లాంటి డైలాగులు.. సినిమాల్లో బాగుంటాయి

రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని టీడీపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు చంద్రబాబు గురించి ఆలోచించడం లేదని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రజల దగ్గరకు యాక్టర్లను పంపిస్తుంటే.. జగన్ డాక్టర్లను పంపిస్తున్నారని, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు చెప్పుకోవటానికి ఒక్క పథకం కూడా లేదని మంత్రి కారుమూరి మండిపడ్డారు. చంద్రబాబు ఇన్నేళ్ళు స్టేల మీదే బతికాడని, శిశుపాలుడిలా చంద్రబాబు పాపం పండిందన్నారు మంత్రి కారుమూరి. అంతేకాకుండా.. చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి జగన్ పై తప్పుడు కేసులు పెట్టారని, చంద్రబాబు సామాజిక వర్గం వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారన్నారు. గతంలో చంద్రబాబు మనకు ఏం ప్రయోజనం చేశాడు అని చర్చించుకున్నారని, ఈ నాలుగేళ్ళల్లో జగన్ మన సామాజిక వర్గానికి చేసిన నష్టం ఏంటి అన్న చర్చ జరిగిందన్నారు.

ప్రభాస్ సలార్ రికార్డు క్రాస్ చేసిన లియో..

దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో.. ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్టర్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో రూపొందుతోన్న ఈ భారీ బడ్జెట్ మూవీలో అర్జున్‌, సంజయ్‌దత్‌, త్రిష ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో రివేంజ్ డ్రామాగా లియో మూవీ తెరకెక్కుతోంది.లియో సినిమాలో కమల్‌హాసన్‌, కార్తి మరియు సూర్య అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. లియో ట్రైలర్‌ను గురువారం మేకర్స్ రిలీజ్ చేశారు. యాక్షన్ అంశాలతో ఈ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. కొంత మంది విజయ్ ఫ్యాన్స్ మాత్రం ట్రైలర్‌తో లోకేష్ కనకరాజ్ డిసపాయింట్ చేశాడంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.యాక్షన్ సీన్స్ మొత్తం గ్రాఫిక్స్‌లో తీసినట్లుగా ఉన్నాయని, విజయ్ క్యారెక్టర్‌ను పవర్‌ఫుల్‌గా చూపించలేదంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. లియో సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • chandrababu
  • karumuri nageswara rao
  • Khushboo
  • Leo
  • Minister roja

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : ఇరాన్ లో 50 మంది విద్యార్థులు మృతి.. బుర్జ్ ఖలీఫా ఖాళీ..

  • Dubai Airport: ప్రపంచంలోనే అత్యంత బిజీ ఎయిర్‌పోర్ట్ దుబాయ్ షట్ డౌన్..

  • Israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధంలో వాడుతున్న ఆయుధాలు, వాటి ప్రత్యేకతలు ఇవే..

  • IPL 2026 : క్రికెట్ పండగకు ముహూర్తం ఖరారు.. కానీ చిన్న ట్విస్ట్!

  • Gold & Silver Prices: యుద్ధం ఎఫెక్ట్.. కొండెక్కిన బంగారం, వెండి ధరలు.. వామ్మో ఒక్కరోజులో ఇంత పెరిగాయేంటి?

  • Iran-Israel War: మోడీ ఇజ్రాయెల్‌ పర్యటనపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!

  • Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions