Minister Jogi Ramesh: చంద్రబాబు ఎంత మంది పీకేలను తీసుకు వచ్చినా వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఏం పీకలేరన్నారు మంత్రి జోగి రమేష్.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబుతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీపై సెటైర్లు వేశారు.. ఇద్దరు పీకేలు కలిసి చంద్రబాబును పీకేస్తారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి మోసం చేశాయన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలను పీకి పాతర వేయటానికి ప్రజా క్షేత్రంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
Read Also: Telangana Congress Party: తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌గా దీపాదాస్ మున్షీ
కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో దాదాపు 3 గంటల పాటు చర్చలు జరిపారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. అయితే, తాను మర్యాదపూర్వకంగా చంద్రబాబును కలిశాను అని తెలిపారు.. చంద్రబాబు సీనియర్ నాయకుడు.. అందుకే చంద్రబాబు దగ్గరకు వెళ్లి కలిసినట్టు చెప్పుకొచ్చారు పీకే.. అయితే, ఇప్పటి వరకు సీఎం వైఎస్ జగన్‌తో పాటు ప్రశాంత్ కిషోర్‌ను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వచ్చిన తెలుగు దేశం పార్టీ.. ఇప్పుడు పీకేనే సంప్రదించడం ఏంటి? ఆయన వ్యూహాలతోనే వచ్చే ఎన్నికల్లో ముందుకు నడుస్తుందా? లేదా? యథావిథిగా పీకే.. వైసీపీ తరఫునే పనిచేస్తారా? అనేది ఆసక్తికర పరిణామంగా మారింది.