అనంతపురంలో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఎంపీ నందిగామ సురేష్, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనకు.. 4 ఏళ్ల వైఎస్ జగన్ పాలనకు ఎంతో తేడా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేసే నైజం సీఎం జగన్ కు ఉందని అన్నారు. వెన్నుపోట్లతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. రాజధాని అమరావతి అవినీతిలో పవన్…
సీఎం క్యాంప్ ఆఫీసుకు కేఏ పాల్.. అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తా.. లేదంటే శపిస్తా..! ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏది చేసినా కాస్త వెరైటీగానే ఉంటుంది.. అది కాస్తా వైరల్గా మారిపోతుంది.. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసేందుకు చేస్తున్న ప్రయత్నం నవ్వులు పూయిస్తుంది.. ఏపీ పర్యటనలో ఉన్న సీఈసీ రాజీవ్ కుమార్ను కలిసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పలు సూచనలు చేశారు.. కేంద్ర ఎన్నిక సంఘం ప్రతినిధుల కలసిన తర్వాత…
కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్... రాష్ట్రంలో ఓట్ల అక్రమాలపై ఫిర్యాదు చేయనున్నారు.. ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, తటస్థుల ఓట్ల తొలగింపు వంటి సంఘటనలు అధికార పార్టీ చేస్తోందని సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
రేపు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చంద్రబాబు ' రా కదలిరా' సభ నిర్వహించనున్నారు. అయితే ఈ సభకు ముందే నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. ఈ సభకు.. ఏవి సుబ్బారెడ్డి రాకూడదని అల్టిమేటం జారీ చేశారు. ఆయన వస్తే రచ్చ రచ్చే అని అంటున్నారు. తాను సైలెంట్ గా ఉన్నా, అనుచరులు ఊరుకోరని భూమా అఖిల ప్రియ అంటున్నారు. ఇదే విషయాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, పరిశీలకుడు ప్రభాకర్ చౌదరి ముందు చెప్పింది అఖిల…
మంత్రి ఆర్కే రోజా టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ అబద్దాలకోరు పార్టీ అని మండిపడ్డారు. ఈరోజు వడమాలపేట మండల పరిషత్ కార్యాలయంలో నూతన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రోజా.. అనంతరం వ్యాఖ్యలు చేశారు. గుంపులు గుంపులుగా వచ్చే పార్టీని హైదరాబాద్ కు తరిమి కొట్టండని విమర్శించారు. వాళ్లు అందరూ కూడా నాన్ లోకల్ పొలిటిషియన్స్ అని తెలిపారు. చంద్రబాబుకి, పవన్ కల్యాణ్, లోకేష్ కి ఆంధ్ర ప్రదేశ్ లో సొంత ఇల్లు గానీ,…
నిన్న పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో టీడీపీ అధినేత చంద్రబాబు 'రా కదలిరా' కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ఎమ్మెల్యేలుపై తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఈ నేపధ్యంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. తన పుట్టినరోజుకు వచ్చిన జనం కూడా.. నిన్న ఆచంటలో…
టీడీపీకి ఏపీ సీఈవో ఎంకే మీనా లేఖ రాశారు.. గత నెల 23వ తేదీన టీడీపీ ఇచ్చిన రిప్రజెంటేషన్పై తీసుకున్న చర్యలు వివరిస్తూ ప్రత్యుత్తరం రాశారు.. 2024 ఓటర్ల తుది జాబితా తయారీలో భాగంగా 2023 డిసెంబరు 9 వరకూ వచ్చిన వేర్వేరు దరఖాస్తులను పరిష్కరించాం. డిసెంబరు 9 తేదీ తర్వాత వచ్చిన 17,976 దరఖాస్తులను కూడా 2024 జనవరి 12 తేదీలోగా పరిష్కరిస్తాం అని తెలిపారు.
మూడు రాజధానులు అని ఏ ఒక్క రాజధాని లేకుండా చేశారని జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఐదేళ్లు రాజధాని లేకుండా పాలన చేయడం జగన్ విశ్వసనీయత అని విమర్శించారు. మరోవైపు.. జగనన్న వదిలిన బాణం ఏమయ్యింది.. తిరిగి జగన్ వైపు దూసుకు వస్తుందని వ్యంగ్యం ప్రదర్శించారు. వైఎస్ మృతికి కారణం అని రిలయెన్స్ పై దాడులు చేశారు.. రిలయెన్స్ వాళ్ళు వస్తే రాజ్యసభ ఇచ్చి పంపించారని చంద్రబాబు ఆరోపించారు. దేశంలో ధనిక సీఎం జగన్.. పెద్దవాళ్ళకు,…