నాకు వ్యాధి, జబ్బు వచ్చిందని అసత్య ప్రచారం చేస్తున్నారు
తనకు వ్యాధి వచ్చింది, జబ్బు వచ్చిందని అసత్య ప్రచారం చేస్తున్నారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశారు. ‘నాయకులకు, కార్యకర్తలకు నా ముఖ్యమైన విజ్ఞప్తి. ఇది అసత్యం… ఇలాంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని సూచించారు. నిరంతరం ప్రభుత్వ కార్యక్రమాల్లో తిరగడంతో కాస్తా డీ హైడ్రేషన్ కి గురి అయ్యానని తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం మెడికవర్ ఆసుపత్రిలో అబ్జర్వేషన్ లో ఉన్నానని.. సోమవారం నుండి యథావిధిగా ప్రభుత్వ, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటానని అన్నారు. పరామర్శల పేరుతో ప్రజలెవరు తన వద్దకు రావొద్దని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం నేను కచ్చితంగా పర్యటిస్తా. ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేస్తా. ఇది నా బాధ్యత. ఎవరు ఎన్ని అనుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అని స్పీకర్ సీతారాం తెలిపారు.
ఇండియా కూటమిలో లుకలుకలు.. కాంగ్రెస్‌పై జేడీయూ నేత ఆరోపణలు..
సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీని, బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ, ఆప్, డీఎంకే, టీఎంసీ, శివసేన(ఉద్ధవ్), ఎన్సీపీ(శరద్ పవార్) వంటి పార్టీలు కూటమిలో కీలకంగా ఉన్నాయి. అయితే గతేడాది కూటమి ఏర్పడినప్పటికీ.. ఇప్పటికీ సీట్ల షేరింగ్‌పై కసరత్తు పూర్తి కాలేదు. కూటమికి సంబంధించి ఇప్పటి వరకు నాలుగు సమావేశాలు జరిగాయి. అయినా సీట్లపై కసరత్తు కొలిక్కిరాలేదు.
అయితే, ఈ వ్యవహారంపై కూటమిలో కీలక పార్టీగా ఉన్న సీఎం నితీష్ కుమార్ జేడీయూ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సీట్ల పంపకంపై 3 నెలలుగా ఆలస్యం అవుతోందని జేడీయూ నేత తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం పరిచారు. దీంతో ఎన్నికల ముందే కూటమిలో అసమ్మతి కనిపించడం ప్రారంభమైంది. మరోవైపు ఇండియా కూటమి కన్వీనర్‌గా సీఎం నితీష్ కుమార్‌ని నియమిస్తారనే వార్తలు వస్తున్నప్పటికీ.. దీనిపై ఇంకా స్పష్టత లేదు.
జగన్ ప్రభుత్వంలో సామాజిక విప్లవం వచ్చింది..
విశాఖ జిల్లా ఉత్తర నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగుతుంది. అందులో భాగంగానే అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వంలో సామాజిక విప్లవం వచ్చిందని తెలిపారు. సామాజిక సాధికారత సాధించామన్నారు. కాగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీలను అవమానించిన నాయకుడు చంద్రబాబు అని మంత్రి మేరుగ మండిపడ్డారు. పేదవాడు ఉన్నత శిఖరాలకు వెళ్ళడమే సామాజిక న్యాయమని మంత్రి పేర్కొన్నారు.
గత ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో అన్యాయం చేసింది
మెదక్ పట్టణంలో ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. ప్రజల నుంచి అభయ హస్తం దరఖాస్తులు మంత్రి దామోదర రాజనర్సింహ స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. వ్యవస్థ అనేది శాశ్వతం… వ్యవస్థను ఎంత ప్రతిష్ట పరిస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో అన్యాయం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.
సినిమాలో తప్ప రాజకీయాలలో సక్సెస్ లేని వ్యక్తి పవన్..
కాకినాడ జిల్లా పెద్దాపురంలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ మోషెన్ రాజు, జూపూడి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. టీడీపీ, జనసేనపై విరుచుకుపడ్డారు. చాలా మంది బ్లడ్ రిలేషన్ కూడా కోల్పోయి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు, పవన్, కొందరు కొత్త వాళ్ళు జగన్ ను దించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డ్
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీఎస్ బీఐఈ) శనివారం జూనియర్ కాలేజీలకు జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. జనవరి 17న కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. అన్ని జూనియర్ కళాశాలలకు – ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్ మరియు అన్ ఎయిడెడ్, కో-ఆపరేటివ్, TS రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్, BC వెల్ఫేర్, KGBVలు మరియు ఇన్సెంటివ్ జూనియర్ కాలేజీలకు సెలవు వర్తిస్తుంది. ముఖ్యంగా ప్రైవేట్ అన్ ఎయిడెడ్‌లు సంక్రాంతి సెలవుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించకూడదని కాలేజీ యాజమాన్యాలను బోర్డు ఆదేశించింది . సూచనలను ఉల్లంఘిస్తే సీరియస్‌గా చూస్తామని, తప్పు చేసిన మేనేజ్‌మెంట్‌లపై డిస్‌ఫిలియేషన్‌తో సహా చర్యలు తీసుకుంటామని టీఎస్ బీఐఈ తెలిపింది.
జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు..
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. 4 ఏళ్ల 9నెలల జగన్మోహన్ రెడ్డి పాలన విధ్వంసకరం, నియంత్రత్వం, అవినీతి, అబద్ధాలమయమని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థతో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు జరిగిన నష్టం కంటే, జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన నష్టమే ఎక్కువని అన్నారు. రాష్ట్రం తిరిగి కోలుకోవడానికి కనీసం 15 ఏళ్లు పడుతుంది.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప రాష్ట్రానికి, ప్రజలకు భవిష్యత్ లేదని కనకమేడల తెలిపారు.
చంద్రబాబుకు భూదాహం ధనదాహం ఎక్కువ.. పేదలపై ప్రేమ లేదు
చంద్రబాబుపై ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీపై టీడీపీకి సంబంధించిన మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని చంద్రబాబు అన్నారు.. ఎస్సీలకే కాదు.. ఎస్టీలకు కూడా చంద్రబాబు ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లనిచ్చిన మామ రామారావు చావుకు చంద్రబాబు కారణమయ్యారని తెలిపారు. చంద్రబాబుకు భూదాహం ధనదాహం ఎక్కువ.. కానీ పేదలపై ప్రేమ లేదని నారాయణ స్వామి ఆరోపించారు.