అమరావత రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామంలో భోగి మంటల కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో పాటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ భోగి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ,చంద్రబాబు నాయుడు అడ్డ పంచె కట్టుకుని సంప్రదాయబద్దంగా కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఇక, భోగి మంటలు అంటించిన తర్వాత ఏపీలోని వివిధ సమస్యల చిత్రపటాలు, జీవో కాపీలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మంటల్లో తగులబెట్టారు. అలాగే, టీడీపీ, జనసేన జెండా గుర్తులతో సహా మహిళలు వేసిన ముగ్గులను ఇరువురు పరిశీలించారు.
Read Also: Heavy Traffic: హైదరాబాద్ -విజయవాడ హైవే.. ఈ రూట్లలో వెళ్తే పండగ తర్వాతే ఇంటికి..
ఇక, రాష్ట్రంలో నాలుగున్నర ఏళ్లుగా జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల జీవో కాపీలను టీడీపీ- జనసేన నేతలు భోగి మంటల్లో దహనం చేశారు. కాగా మూడు రోజుల పాటు ‘రా కదలిరా’ కార్యక్రమానికి టీడీపీ, జనసేన పార్టీలు పిలుపు నిచ్చాయి. అలాగే, గుంటూరు జిల్లాలోని టీడీపీ పార్టీ ఆఫీసు దగ్గర తెలుగు యువత ఆధ్వర్యంలో భోగి మంటల వేడుకలు సాగాయి. ‘కీడు తొలగాలి… ఏపీ వెలగాలి’ అనే పేరుతో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనలో ఇచ్చిన జీవోలను భోగి మంటల్లో కాల్చి వేశారు. అలాగే వైసీపీ మ్యానిఫెస్టో పేపర్లను సైతం టీడీపీ నేతలు తగలబెట్టారు.