చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో వైసీపీ దూసుకుపోతుంది. ఆ నియోజక వర్గంలోని నాలుగు మండలాల్లోనూ వైయస్సార్సీపీ ఘన విజయం సాధించింది. కుప్పం మండలంలో 19 ఎంపీటీసీలకు వైయస్సార్సీపీకి 17, టీడీపీకి 2 గెలిచాయి. అలాగే…. గుడిపల్లె మండలంలో 12 ఎంపీటీసీల్లో అన్ని చోట్లా గెలిచింది వైయస్సార్సీపీ. రామకుప్పం మండలంలో 16 ఎంపీటీసీలకు అన్నిచోట్లా గెలిచింది వైయస్సార్సీపీ. ఇక శాంతిపురం మండలంలో 18 ఎంపీటీసీలకు 11 చోట్ల వైయస్సార్సీపీ, 1 చోట టీడీపీ గెలుపొందాయి. మరో 6 చోట్ల ఫలితాలు…
టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి రాజ్‌భవన్‌లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు.వైసీపీనేతలు దాడికి పాల్పడుతున్న దృశ్యాల సీసీ టీవీ ఫుటేజీని కూడా వినతిపత్రంతో పాటు గవర్నర్ కార్యదర్శికి సమర్పించామన్నారు. టీడీపీ కార్యకర్తలు తన కారు అద్దాలు పగులగొట్టారన్నారు జోగి రమేష్.చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. అదే సమయంలో టీడీపీ నేతలకు వార్నింగిచ్చారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ మధ్య అస్సలు కాలం కలిసి రావడం లేదు. ఆయన తీసుకున్న నిర్ణయం బెడిసి కొడుతోందని సొంతపార్టీ నేతలు అంటున్నారు. రాజకీయాల్లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ, అపార చాణిక్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న చంద్రబాబుకు రాబోయే ఎన్నికలు ఛాలెంజ్ గా మారాయి. ప్రతిపక్షంలో ఉండటం టీడీపీ అధినేత చంద్రబాబుకు కొత్త కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల పాలనలో టీడీపీ దాదాపు కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకోవడం ఆయనకు మింగుడుపడటం లేదు. దీంతో జగన్ రెండోసారి…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ, నవ్యాంధ్రలుగా ఏర్పడ్డాక రాజకీయంలో స్పష్టమైన మార్పు వచ్చేసింది. తెలంగాణ మిగులు బడ్జెట్ తో ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించగా.. ఏపీ మాత్రం లోటుబడ్జెట్ రాష్ట్రంగా మిగిలిపోయింది. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కేంద్రం చెప్పినా.. అది నీటిమీద రాతలుగా మిగిలిపోయింది. హైదరాబాద్ ను తానే నిర్మించానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పాలనలో కనీసం ఏపీకి రాజధానిని కూడా నిర్మించకపోవడం శోచనీయంగా మారింది. తన పాలనలో సంక్షేమాన్ని పెద్దగా…
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. రాజకీయ వ్యూహాత్మక మౌనాన్ని కొనసాగిస్తున్నారా? పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే క్రమంలో.. ఆయన సరికొత్త ఆలోచనలు చేస్తున్నారా? సరికొత్త గేమ్ ప్లాన్ తో బరిలోకి దిగబోతున్నారా? ఈ ప్రశ్నలకు.. ఆయన వ్యవహారశైలి అవుననే సమాధానం చెబుతోంది. సందర్భానుసారం మాట్లాడ్డం.. ముఖ్యమైన విషయాలపై ట్వీట్లు చేయడం తప్ప.. పెద్దగా హడావుడి చేయకుండా.. ఆయన ఎదురుచూస్తున్న తీరు సైతం.. సరికొత్త వ్యూహాలకు ఆయన పదును పెడుతున్నారన్న అభిప్రాయాన్ని కలిగిస్తోంది. తాజా పరిణామాలను విశ్లేషిస్తే.. చంద్రబాబు…
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈరోజు కడప జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. పార్టీకి సంబందించిన పలు అంశాలపై చర్చించారు. జమ్మలమడుగు నియోజక వర్గం టీడీపి ఇన్‌చార్జీగా మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి కుమారుడు భూపేష్ రెడ్డిని నియమించాలని ఈ చర్చలో నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది. అదే విధంగా బద్వేల్ ఉప ఎన్నికపై కూడా భేటీలో చర్చించారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్‌ను…
ఆంధ్రా అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు.. దూకుడుగా మాట్లాడుతుంటారు. అది పార్టీ వ్యూహమైనా సరే.. వ్యక్తిగత ఆవేశమైనా సరే.. తమ పార్టీని ఎవరైనా విమర్శిస్తే వాళ్లు చూస్తూ ఊరుకోరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా.. ఆ పార్టీ నాయకులు అలాగే ప్రవర్తించారు కూడా. ఇందులో ముఖ్యంగా.. కొడాలినాని, అనిల్ కుమార్ యాదవ్, రోజా వంటి నేతలు.. ఈ దూకుడును ముందుకు తీసుకుపోయారు. ఈ లిస్ట్ లో.. తాజాగా.. అత్యంత నెమ్మదస్తురాలిగా మాట్లాడే… లక్ష్మీపార్వతి సైతం చేరిపోయారు. ఎన్టీఆర్…
ఆ ఇద్దరికీ ఆమె రాఖీ కట్టింది. ఆ రాఖీ కట్టిన ఫొటోలే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకోలా ట్రోల్ అవుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలు ఓ అస్త్రంగా చేసుకుంటున్నాయి కూడా. ఇంతకీ ఆ రాఖీ తెచ్చిన తంటాలేంటో ఇప్పుడు చూద్దాం. సీతక్క రాఖీ కట్టిన ఫొటోలతో ట్రోలింగ్ తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు సీతక్క. పీసీసీ చీఫ్‌కు బలమైన మద్దతుదారు. టీడీపీని వీడి కాంగ్రెస్‌లో ఆమె చేరింది కూడా రేవంత్‌ను నమ్ముకునే. కొత్త పీసీసీ చీఫ్ నియామకం తర్వాతసీతక్కకు…
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, కెసిఆర్ లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్ళేనని… వైఎస్ఆర్, చంద్రబాబు, కెసిఆర్ లాంటి నాయకులను కూడా యూత్ కాంగ్రెస్ అందించిందన్నారు. యూత్ కాంగ్రెస్ వాళ్ళు టికెట్ల అడిగే ముందు… ప్రజల కోసం ప్రభుత్వం మీద ఏం కొట్లాడినరో చూస్తామని తెలిపారు. టికెట్ తీసుకుని జనం లోకి పోతా అంటే… ఓడిపోతారని పేర్కొన్న రేవంత్… పోటీ చేసి ఓడిపోతే బాల్య వితంతులుగా…
గోరంట్ల బుచ్చయ్య చౌదరి బెదిరించారా? బ్లాక్మెయిల్ చేశారా? అవమానాలకు, అప్రాధాన్యతలకు అలక బూనారా? అధిష్ఠానం మెడలు వంచడానికి రాజీనామా డ్రామా ఆడారా? లేక నిజంగానే బైబై చెప్పేయాలని నిర్ణయించుకున్నారా? ఇది టీకప్పులో తుఫానా? ఉప్పెన అవుతుందా? బుచ్చయ్యకు చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వలేదా? టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీలో అలజడి రేపారు. ఎన్టీఆర్ తర్వాత పార్టీలో చిన్న అన్నగా గుర్తింపు పొందిన ఆయన చంద్రబాబుకంటే టీడీపీలో సీనియర్. అయినప్పటికీ పదవుల…