టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గురువారం నాడు చంద్రబాబు సర్పంచుల అవగాహన సదస్సులో పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం విధిస్తోన్న పన్నులు వంటి పలు అంశాలపై చంద్రబాబు విమర్శలు చేయడం, చెత్తపన్ను వసూలు చేయబోమని పంచాయతీలు తీర్మానం చేయాలని సూచించడం వంటి అంశాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ‘చంద్రబాబు గారు సర్పంచుల సదస్సు పెట్టింది ప్రభుత్వాన్ని ఎలా బ్లాక్…
పేదలంటే సీఎం జగనుకు విద్వేషం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదలు మంచి ఇళ్లల్లో ఉండటం సీఎం జగనుకు ఇష్టం లేదని, ఉగాది నాటికి ఎంతమంది పేదలను కొత్త ఇళ్లలోకి పంపుతున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక్క పునాది కూడా తవ్వకుండా పేదలు కోరుకున్న ప్రభుత్వమే ఇల్లు కట్టించాలన్న 3వ ఆప్షన్ నుంచి వెనక్కి తగ్గుతున్నారన్నారు. ఇంతవరకు ఒక్క ఇల్లు కట్టకపోగా, చంద్రబాబు…
అమరావతి: టీడీపీ కార్యాలయంలో రెండో రోజు సర్పంచుల అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ సర్పంచ్లకు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. చెత్త పన్నుకు వ్యతిరేకంగా పంచాయతీల్లో తీర్మానం చేయాలని వారికి హితవు పలికారు. టీడీపీ సర్పంచ్లు ఉన్న ప్రతి చోట చెత్త పన్నుకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలన్నారు. గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలన్నారు. ఫైనాన్స్ కమిషన్ నిధులు పంచాయతీలకు ఇవ్వకుంటే ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేయాలని.. ఆ దిశగా…
ఏపీలో టీడీపీ బలోపేతంపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం టీడీపీ ఇంఛార్జులు, పలువురు ఎమ్మెల్యేలతో టీడీపీ అధిష్టానం సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా హాజరుకావాల్సి ఉంది. అయితే చంద్రబాబుతో సమావేశానికి గంటా హాజరుకాలేదు. త్వరలో వచ్చి చంద్రబాబును కలుస్తానని టీడీపీ కార్యాలయానికి గంటా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే నిర్ణయించుకున్న కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండడంతో రాలేకపోతున్నానని గంటా చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. Read Also:…
ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. దొంగే దొంగ అంటే ప్రజలు నమ్ముతారనే భ్రమలో చంద్రబాబు ఉంటాడని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకున్న దుర్మార్గుడు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. ప్యాకేజీ వద్దు ప్రత్యేక హోదానే కావాలని ఉద్యమం చేసిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. జీవీఎల్ నరసింహారావు పక్క రాష్ట్రంలో ఎంపీ పదవి తెచ్చుకున్న వ్యక్తి అని.. పదిహేను రోజులకు…
రాష్ట్రానికి సూడో విద్యుత్ శాఖ మంత్రిగా షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ వ్యవహరిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీకాంత్ సీఎం చెప్పారని విద్యుత్ శాఖ బాధ్యతలన్నీ షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ కు అప్పగించారన్నారు. విద్యుత్ శాఖకు అవసరమైన అనేక పరికరాలు ఎక్కువ ధరకు ఈ షిరిడీ సాయయే సంస్థే సరఫరా చేస్తోందని, విద్యుత్ శాఖలో ముగ్గురు సీఎండీల నియామకం కూడా కడప రెడ్డికి చెందిన షిరిడిసాయి…
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి విమర్శలు చేశారు. జగన్ సీఎం అయ్యాక అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని.. అప్పు చేయకపోతే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యే స్థాయికి తీసుకువచ్చారని మండిపడ్డారు. 2009 నాటికి ఏపీ అప్పు 3,14,000 వేల కోట్లుగా ఉంటే.. ప్రస్తుతం ఏపీ అప్పు రూ.7లక్షల కోట్లకు చేరిందన్నారు. రాష్ట్రంలోని ఆస్తులన్నీ ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నారని.. చివరకు విజయవాడలో పార్కును కూడా తాకట్టు పెట్టే స్థాయికి వచ్చారని ఎద్దేవా…
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం సందర్భంగా పలువురిని పోలీసులు అరెస్ట్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల నిరసనలపై జగన్ ప్రభుత్వ నియంతృత్వ తీరును ఆయన ఖండించారు. లక్షల మంది సమస్యపై అహంకారంతో కాకుండా ఆలోచనతో స్పందించాలని, ప్రభుత్వం చేసిన మోసంపై నిరసన తెలిపే హక్కు ఉద్యోగులకు లేదా అని చంద్రబాబు నిలదీశారు. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్ట్ చేస్తారా? అంటూ మండిపడ్డారు. Read Also: ఉద్యోగులతో…
2022-23కు గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే ఈ బడ్జెట్ పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని ఆయన అన్నారు. రైతులు, పేదల కోసం ఏం చేస్తున్నారో చెప్పలేదన్నారు. వేతన జీవులకు మొడి చేయి చూపారన్నారు. నదుల అనుసంధానంపై కేంద్ర ప్రణాళికలను స్వాగతిస్తున్నామన్నారు. డిజిటల్, సోలార్, ఎలక్ట్రికల్ వెహికిల్ రంగంలో సంస్కరణలు మంచి పరిణామం అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు సాధించడంలో మరోసారి వైసీపీ…
నారీ సంకల్ప దీక్ష చేసే అర్హత టీడీపీకి లేదని వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… టీడీపీ పై తీవ్ర విమర్శలు చేశారు. అది నారీ సంకల్ప దీక్ష కాదు. దుస్సంకల్ప దీక్ష అని ఎద్దేవా చేశారు. లోకేష్ పీఏ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నా రని దాన్ని చంద్రబాబు పక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు. లోకేష్ స్విమ్మింగ్ పూల్ ఫోటోలు చూస్తే వారికి మహిళల పట్ల ఏమాత్రం గౌరవం ఉందో అర్థం…