Chandrababu Naidu: మీడియా కోఆర్డినేటర్ నరేంద్ర అరెస్ట్ పై డీజీపీకి చంద్రబాబు లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Naidu Letter To DGP :ఏపీలో పోలీసుల తీరుపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu)పార్టీ మీడియా కో ఆర్డినేటర్ నరేంద్ర అరెస్టుపై డీజీపీకి లేఖ రాశారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. సుప్రీంకోర్టు అదేశాలకు విరుద్దంగా సిఐడి పోలీసులు వ్యవహరించారు…వెంటనే నరేంద్రను విడుదల చేయాలి అని లేఖలో పేర్కొన్నారు. టీడీపీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రను సిఐడి పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. సుమారు 7 మంది వ్యక్తులు రాత్రి సమయంలో నేమ్ బ్యాడ్జ్ లు కూడా లేకుండా నరేంద్ర ఫ్లాట్‌లోకి ప్రవేశించి, తాము సిఐడికి అని చెప్పి అతన్ని తీసుకువెళ్లారు.
Read Also: Bus Fire: బస్సులో చెలరేగిన మంటలు.. అగ్నికి ఆహుతైన 17 మంది ప్రయాణికులు
Also Read
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ఆరోగ్య సమస్యలు ఉన్న నరేంద్ర ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే మొత్తం పోలీసు శాఖ బాధ్యత వహించాలి.ప్రతిపక్ష టీడీపీ నేతలు, క్యాడర్‌ను టార్గెట్ చేయడంలో సిఐడి పూర్తిగా నిమగ్నమైంది. సెక్షన్ 41A కింద నోటీసు ఇవ్వకుండా అరెస్టు చెయ్యాల్సిన అవసరం ఏముంది? ఇదే కేసులో అంకబాబును అరెస్టు చేసినందుకు కోర్టు సిఐడి పోలీసులకు షోకాజ్ నోటీసు జారీ చేసినవిషయం గుర్తులేదా?సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా రాత్రి సమయంలో నరేంద్రను అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటి? అని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.
టీడీపీ కార్యాలయంపై వైఎస్‌ఆర్‌సిపి దాడి చేసి ఏడాది గడిచినా ఇప్పటికీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.సిఐడి తనంతట తానే ఒక చట్టం అని భావిస్తుంది.వైఎస్సార్‌సీపీ ప్రతీకార రాజకీయాలకు సీఐడీ సహకారం విస్మయం కలిగిస్తోంది. అధికార పార్టీ ప్రయోజనాల కోసం సిఐడి దిగజారడం బాధాకరం.బాధితులను బెదిరించడం, కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం కోసమే పోలీసులు ఈ తరహా అరెస్టులు చేస్తున్నారు.దారపనేని నరేంద్రను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి అక్రమ అరెస్టులు జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నా అని డీజీపీ రాసిన లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.

Read ALso: Karnataka Hijab Ban: హిజాబ్ నిషేధంపై నేడు సుప్రీంకోర్టు తీర్పు
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!