ఆంధ్రప్రదేశ్‌పై విరుచుకుపడిన మొంథా తుఫాన్ భారీ నష్టాన్ని మిగిల్చింది. రాష్ట్రవ్యాప్తంగా పంటలు, ఆస్తులు, మౌలిక సదుపాయాలకు గణనీయమైన నష్టం వాటిల్లినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్‌పై విరుచుకుపడిన మొంథా తుఫాన్ కారణంగా పంటలు, ఆస్తులు భారీగా దెబ్బతిన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ ప్రభావం, పంట నష్టం, పునరావాస చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో సీఎం పరిస్థితిని సమీక్షిస్తూ పలు సూచనలు జారీ చేశారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తుఫాన్‌ను ఎలా ఎదుర్కోవాలో ముందుగానే అన్ని విధాలా సిద్ధమయ్యామన్నారు. అవసరమైన ప్రోక్లేన్స్ను ముందుగానే సిద్ధం చేసుకున్నామని, NDRF, SDRF బృందాలను, సీనియర్…
YS Jagan : ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఈ తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. “తుఫాన్ కారణంగా పంటలు బాగా నష్టపోయాయి. ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి. పైరు పొట్ట దశలో ఉన్నప్పుడు తుఫాన్ తాకి దిగుబడులు తగ్గిపోయాయి. నేలకొరిగిన పంట తిరిగి నిలబడే అవకాశం లేదు. దాదాపు 25 జిల్లాల్లో ప్రభావం చూపగా, 15 లక్షల…
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొంథా తుఫాన్ తర్వాత పరిస్థితితో పాటు పంట నష్టంపై కాసేపట్లో ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
Montha Cyclone: ‘మొంథా’ తుఫాన్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) కేంద్రం నుండి అధికారులతో నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు ఐదుగురు లేదా ఆరుగురు సభ్యులతో కూడిన ప్రభుత్వ బృందాలను తక్షణమే గ్రామాలకే పంపించాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ బృందాలు గ్రామాల్లో అందుబాటులో ఉంటే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.…
Nara Lokesh: గత ఐదు రోజులుగా రాష్ట్రంపై ప్రభావం చూపుతున్న భారీ తుఫాన్ ఈ రాత్రి సుమారు 11 గంటల సమయంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఇది తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావం దాదాపు 40 లక్షల మందిపై ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రాణ నష్టం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండకూడదనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతోందని మంత్రి లోకేష్…
కల్తీ మద్యం కేసులో తన ప్రమేయం లేదని విజయవాడ కననదుర్గమ్మ గుడిలో మాజీ మంత్రి జోగి రమేశ్ ప్రమాణం చేశారు. ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వచ్చిన ఆయన.. కననదుర్గమ్మ అమ్మవారి ఎదుట సత్యప్రమాణం చేశారు. ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద చేతిలో దివ్వెను వెలిగించుకున్న జోగి రమేశ్.. కల్తీ మద్యం కేసులో తనకే సంబంధం లేదన్నారు. మద్యం కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, తన మనసు బాధ కలిగించారన్నారు. ‘జోగి రమేష్ అనే…
మంత్రి నారా లోకేష్‌కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. మొంథా తుపానుకు సంబంధించి కేంద్రంతో సమన్వయ బాధ్యతలను లోకేష్‌కు సీఎం చంద్రబాబు అప్పగించారు. తుపానుకు సంబంధించి సీఎం చంద్రబాబు ఈరోజు ఉదయం కీలక సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా ముందు జాగ్రత్త చర్యలతో పాటు తుఫాన్ ప్రారంభం అయ్యే ముందు పరిస్థితి అంచనా వేసి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గాలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి విద్యుత్తు అంతరాయం లేకుండా చూడాలన్నారు. హోర్డింగ్స్ విషయంలో కూడా తగిన చర్యలు…
CM Chandrababu: మొంథా తుఫాన్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో తీరప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
దుబాయ్ పర్యటనలో చివరి కార్యక్రమంగా గల్ఫ్‌లోని తెలుగు ప్రజలతో డయాస్పోరా కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. గల్ఫ్‌లోని యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఓమన్, బహ్రెయిన్, ఖతార్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దుబాయ్కిలోని లీ మెరిడియన్ హోటల్లో అత్యంత ఉత్సాహభరితంగా తెలుగు డయాస్పోరా కార్యక్రమం జరిగింది. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు జాతికి తిరుగే లేదని, ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1గా తయారవుతుందన్నారు. ప్రపంచంలో…