మంగళగిరి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో కానిస్టేబుళ్లుగా ఎంపికైన 5,757 మంది అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమాన్ని నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. సివిల్, ఏపీఎస్పీ కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అందరి మధ్యలో ఉండి మాట్లాడమని సీఎం సూచించారన్నారు. ఉద్యోగాలు వచ్చి కోర్ట్ లో కేసులు ఉండటం వల్ల ఆలస్యం అయ్యిందని తెలిపారు. న్యాయపరమైన చిక్కులు గత ప్రభుత్వం తొలిగించలేదని మండిపడ్డారు.
Also Read: CM Chandrababu : కోర్టుల్లో కొట్లాడి విజయవంతంగా రిక్రూట్‌మెంట్ పూర్తిచేశాం
అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్నారన్నారు. గత ప్రభుత్వంలో కోల్పోయిన కాలం తీసుకురాలేకపోయినా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంచి కార్యక్రమం చేశారు. న్యాయపరమైన చిక్కులు తొలగించి కూటమి ప్రభుత్వం నిబద్దతకి నిదర్శనం గా నిలిచిందన్నారు. కూటమి ప్రభుత్వం వాటన్నిటిని చేధించి అందరికి ఉద్యోగ అవకాశాలు కలిపించిందన్నారు. సమాజానికి గౌరవ ప్రతిష్టలు తెచ్చే ఉద్యోగానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని పవన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సుస్థిరత,యువత భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని వెల్లడించారు.
6వేల మంది ప్రవేశ పరీక్షలు రాసి 3సంవత్సరాలుగా ఉద్యోగ అవకాశం కోల్పోడమే కాదు విలువైన సమయం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంద్ర నుంచి ఎక్కువ మంది అభ్యర్డులు ఎంపిక అయ్యారు. ప్రతి జిల్లా పై సీఎం ప్రత్యేక శ్రద్ద చూపించి అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారని కొనియాడారు. వేరొక కార్యక్రమం లో మంత్రి లోకేష్ ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు.. మంత్రి నారా లోకేష్ లేని లోటు బలంగా కనపడుతుందన్నారు.
Also Read:Rahul Gandhi : మహాత్మ గాంధీ గ్రామీణ ఉద్యోగ హామీ బిల్లుపై పేరుమార్పును అంగీకరించను!
ఒక్కో అభ్యర్థి కి ఒక్కో కథ ఉంటుంది.. మా నాన్న ఒక కానిస్టేబుల్ గా పనిచేసినప్పుడు ప్రమోషన్ కోసం మా కుటుంబం అంతా వేచి చూసేవాళ్ళమని పవన్ కళ్యాణ్ తెలిపారు. మీ అందరిని దగ్గరగా చూస్తుంటే చాలా ఆనందం అనిపించిందన్నారు. మీ కళ్ళల్లో ఆనందం మా తల్లిదండ్రుల్లో చూసుకున్న ఆనందం కలిగిందని తెలిపారు. ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. 6,100 మందిని రిక్రూట్ చేసుకునేందుకు నోటిఫికేషన్ ఇవ్వగా.. అందులో 6,014 మంది ఎంపికయ్యారు. వీరిలో 5,757 మంది ట్రైనింగ్ కు ఎంపికయ్యారు. సివిల్ కానిస్టేబుళ్లుగా 3,343 మంది ఎంపిక.. APSP కానిస్టేబుళ్లుగా 2,414 మంది ఎంపిక.. సివిల్ లో 993 మంది మహిళా కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు.