టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ కేసుపై రేపు ( గురువారం ) సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు సుప్రీం కోర్టుకు వెళ్లారు. రేపేు కోర్ట్ నెంబర్ 6లో 11 వ నెంబర్గా చంద్రబాబు కేసు లిస్ట్ లో ఉంది.
చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు సంతోషకరం అన్నారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డా. చింతా మోహన్.. అయితే, చంద్రబాబును మరలా అరెస్ట్ చేసే తప్పు చేయొద్దని సూచించారు.
చంద్రబాబుకు మధ్యంతర బెయిల్పై స్పందిస్తూ సెటైర్లు వేశారు మంత్రి అంబటి రాంబాబు.. హై కోర్టులో చంద్రబాబుకు మద్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చారన్న ఆయన.. న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది అని టీడీపీ నాయకులు హంగామా చేస్తున్నారు.. టీడీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానాలి.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు.
చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసింది సీఐడీ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై కొత్త కేసు నమోదు చేసింది సీఐడీ. ఈ కేసులో చంద్రబాబును ఏ3గా చేర్చుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఇక, సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణకు అనుమతి ఇచ్చింది.
చంద్రబాబు నాయుడు చరిత్ర ముగిసింది అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏవి లోకేష్ కి లేవు అని మండిపడ్డారు.
Chandrababu Naidu Writes Letter to ACB Court Judge: టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు మరియు ఆందోళన వ్యక్తం చేస్తూ.. 3 పేజీల లేఖ రాశారు. అక్టోబర్ 25న రాసిన లేఖను జైలు అధికారుల ద్వారా ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు పంపారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనను చంపాలని కొందరు కుట్ర పన్నుతున్నారంటూ లేఖలో బాబు…
Judge withdraws from bail petition filed by Chandrababu Naidu: స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ నుంచి న్యాయమూర్తి వైదొలిగారు. ఈ పిటిషన్ దసరా పండగ సెలవుల ప్రత్యేక బెంచ్ (వెకేషన్ బెంచ్) ముందు విచారణకు రాగా.. ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో విచారణ…