విశాఖ టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద 'న్యాయానికి సంకెళ్లు ఇంకెన్నాళ్లు'.. నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
రాజమండ్రిలోని సెంట్రల్ జైలులో చంద్రబాబు ఉంటున్న బ్యారెక్‌లో ఎట్టకేలకు టవర్ ఏసీ ఏర్పాటు చేయడం మాత్రమే సరిపోదని బాడీ చెకప్ చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో జుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. అయితే, చంద్రబాబు జైలుకు వెళ్లి నెలరోజులు దాటింది అన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరడం తప్పా అంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు తాను వ్యతిరేకమని సోషల్ మీడియాలో తనపై ట్రోల్ చేస్తున్నారని ఆయన తెలిపారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ప్రభుత్వ వైద్యులు వెల్లడించారు. ఆయనకు చల్లటి వాతావరణం అవసరమని వారు పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యలో ప్రభుత్వ వైద్యులతో కలిసి జైళ్ల శాఖ డీఐజీ మీడియా సమావేశం నిర్వహించారు.
అమిత్ షా-లోకేష్ భేటీపై పురంధేశ్వరి స్పందించారు. లోకేష్‌ను అమిత్ షా పిలిచారా..? లేక లోకేష్ అడిగారా..? అనేది అప్రస్తుతమని.. వారిద్దరి మధ్య భేటీ జరిగిందన్నారు. చంద్రబాబుపై ఏయే కేసులు పెట్టారు..? ఏయే బెంచ్‌ల మీదకు కేసులు వెళ్లాయని అమిత్ షా అడిగారని ఆమె వెల్లడించారు
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కీలక నివేదిక ఇచ్చారు. చంద్రబాబు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు రాజమండ్రి ప్రభుత్వ వైద్యులు మెడికల్ రిపోర్టులో వెల్లడించారు. మెడికల్ రిపోర్టును బయటపెట్టకుండా ఇప్పటి వరకు అంతా బాగుంది అంటూ జైలు అధికారులు చెప్పుకొచ్చినట్లు సమాచారం.
Telangana: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు హైదరాబాద్‌లో వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చారు.