Nara Bhuvaneshwari: వైసీపీది ధనబలం, టీడీపీది ప్రజాబలం.. ఈ ప్రభుత్వం పని అయిపోయింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Bhuvaneshwari: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధనబలం, తెలుగుదేశం పార్టీది ప్రజాబలం.. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం పని అయిపోతుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. శ్రీకాళహస్తిలో నిజం గెలవాలి కార్యక్రమంలో భువనేశ్వరి ప్రసంగిస్తూ.. ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు ఆత్మగౌరవం, చంద్రబాబు ఆత్మవిశ్వాసం తెచ్చారన్నారు.. 49 రోజులుగా చంద్రబాబును జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు..చంద్రబాబు నాయుడు అవినీతి చేశారని ప్రజలు నమ్మడం లేదన్న ఆమె.. పరిశ్రమలు ఏర్పాటు చేయటం తప్పా..? అమరావతి రాజధాని నిర్మించడం తప్పా…? పోలవరం కట్టడం తప్పా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక, ఏపీ అంటే అరాచకం, అప్పుల రాష్ట్రం అంటూ సంచలన ఆరోపణలు చేశారు. మళ్లీ చంద్రబాబు బయటకు వచ్చి మరింత ఉత్సాహంగా ప్రజల కోసం పనిచేస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.. రాబోయే కురుక్షేత్ర యుద్దంలో టీడీపీ, జనసేన కూటమి విజయం తధ్యం అనే జోస్యం చెప్పారు నారా భువనేశ్వరి.
Read Also: Congress: రేపు తెలంగాణ పర్యటనకు కర్ణాటక డిప్యూటీ సీఎం.. ఎల్లుండి ఖర్గే
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
అభివృద్ధికి పాటుపడటమేనా చంద్రబాబు చేసిన నేరం? రాష్ట్రమే కుటుంబంగా 45 ఏళ్లుగా అభివృద్ధికి పాటుపడటమేనా చంద్రబాబు చేసిన నేరం. తన విజన్ తో ఐటీ రంగానికి ప్రోత్సాహం అందించి యువతకి ఉద్యోగాలు కల్పించడమే చంద్రబాబు చేసిన పాపమా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు నారా భువనేశ్వరి.. ప్రజలు, కార్యకర్తలు నా మీద చూపిస్తున్న ప్రేమ, అభిమానాలే ఈ పోరాటంలో నాకు శ్రీరామరక్షగా అభివర్ణించారు నారా భువనేశ్వరి. ఇక, చంద్రబాబు అరెస్ట్‌ను తట్టుకోలేక మృతిచెందినవాళ్ల కుటుంబాలను పరామర్‌శించి.. టీడీపీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు నారా భువనేశ్వరి.. నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి యాత్రకు పూనుకున్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!