శుక్రవారం జరిగిన అత్యవసర భేటీలో హైబ్రిడ్ మోడల్ లో టోర్నమెంట్ ని నిర్వహించడం తప్ప పాక్‌కు మరో ప్రత్యామ్నాయం లేదని ఐసీసీ తేల్చి చెప్పింది. అలా కుదరదంటే మెగా టోర్నీ ఆతిథ్య హక్కులను మరో దేశానికి ఇచ్చేస్తామని స్పష్టం చేసింది. హైబ్రిడ్ పద్ధతికి సుముఖంగా ఉంటేనే ఈ రోజు (నవంబర్ 30)పీసీబీతో సమావేశం జరిపి షెడ్యూల్‌ను ఖరారు చేయాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ భావిస్తుంది.