జార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో జెఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో బస చేశారు. ఇక, చంపయ్ సోరెన్ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం ఇవాళ జార్ఖండ్ అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోనుంది.
Jharkhand: జార్ఖండ్ రాజకీయాలు కీలక దశకు చేరుకున్నాయి. హేమంత్ సొరెన్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో చంపై సొరెన్ ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. ఇదిలా ఉంటే, ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకునేందుకు సోమవారం ‘ఫ్లోర్ టెస్ట్’ ఉంది. దీంతో ఎమ్మెల్యేలంతా ఆదివారం హైదరాబాద్ నుంచి రాంచీకి బయలుదేరారు.
ఝార్ఖండ్ (Jharkhand) మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు (Hemant Soren) కోర్టులో ఊరట లభించింది. సోమవారం అసెంబ్లీలో జరగనున్న బలపరీక్షకు హాజరయ్యేందుకు రాంచీ ప్రత్యేక కోర్టు హేమంత్‌కు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన శాసనసభలో జరిగే బలపరీక్షకు హాజరుకానున్నారు.
ఝార్ఖండ్ సంక్షోభానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఎట్టకేలకు చంపయ్ సోరెన్ సీఎంగా ప్రమాణం చేశారు. హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో తీవ్ర సందిగ్ధం ఏర్పడింది.
Champai Soren to take oath as Jharkhand CM Today: నేడు ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం సీనియర్ నేత చంపయీ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేయాలని చంపయీకి ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆహ్వానం అందించారు. శుక్రవారం సాయంత్రం ప్రమాణస్వీకరణ కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. హేమంత్ సోరెన్ బుధవారం రాజీనామా చేసినప్పటి నుంచి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి మధ్య వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే తన వాదనను ఆమోదించాలని…
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి పదవి నుంచి హేమంత్ సొరెన్ తప్పుకున్నారు. కొత్త సీఎంగా చంపై సొరెన్‌ను జేఎంఎం శాసనసభాపక్షం ఎన్నుకుంది. చంపై సొరెన్‌ను తదుపరి సీఎంగా ఎన్నుకున్నట్లు జేఎంఎం పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించారు.
మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్ అయితే ఆయన భార్య కల్పనా సోరెన్ సీఎం అవుతారంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. హేమంత్ సోరెన్ కూడా కల్పనా వైపు మొగ్గు చూపారు. కానీ చివరికి ఆ ప్లాన్ రివర్స్ కొట్టింది. కూటమిలో విభేదాలు తలెత్తడంతో సడన్‌గా తెరపైకి మరో కొత్త పేరు వచ్చింది.
ఝార్ఖండ్ కొత్త సీఎంగా చంపై సోరెన్ బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో హేమంత్ సోరెన్ రాజీనామా చేసినట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్యేలంతా చంపై సోరెన్‌ను సీఎంగా ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.