Jharkhand CM: నేడు ఝార్ఖండ్ సీఎంగా చంపయీ సోరెన్ ప్రమాణస్వీకారం.. 10 రోజుల్లో బలపరీక్ష!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Champai Soren to take oath as Jharkhand CM Today: నేడు ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం సీనియర్ నేత చంపయీ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేయాలని చంపయీకి ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆహ్వానం అందించారు. శుక్రవారం సాయంత్రం ప్రమాణస్వీకరణ కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. హేమంత్ సోరెన్ బుధవారం రాజీనామా చేసినప్పటి నుంచి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి మధ్య వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే తన వాదనను ఆమోదించాలని చంపయీ గవర్నర్‌ను కోరిన కొన్ని గంటల తర్వాత ఈ ఆహ్వానం వచ్చింది. ఇక వచ్చే 10 రోజుల్లో జరగనున్న ఫ్లోర్ టెస్ట్‌లో చంపయీ తన మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంది.
మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో.. సంకీర్ణ కూటమి తమ శాసనసభపక్ష నేతగా చంపయీ సోరెన్‌ని ఎన్నుకుంది. చంపయీ పలువురు ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్ర గవర్నర్‌ను గురువారం కలిశారు. తనకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. కొన్ని గంటల అనంతరం గవర్నర్ సానుకూల నిర్ణయం తీసుకున్నారు.
Also Read
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
- ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
Also Read: Gold Rate Today: పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
తమ కూటమి ఎమ్మెల్యేలను రాష్ట్రం దాటించేందుకు జేఎంఎం సిద్దమైంది. ఓవైపు గవర్నర్ నిర్ణయం ఆలస్యమవుతుండడం, ప్రతిపక్ష బీజేపీ తమ ఎమ్మెల్యేలను తమవైపు ఆకర్షిస్తుందనే అనుమానాల నేపథ్యంలో.. జేఎంఎం, ఆర్జేడీ, కాంగెస్ కూటమి ఈ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించేందుకు జేఎంఎం ఏర్పాట్లు చేసింది. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ప్రయాణం వాయిదా పడింది. నేడు వారు హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!