తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ తొలిసారి జనం మధ్యలోకి రాబోతున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ రోడ్డులోని 50 ఎకరాల స్థలంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రైతు గర్జన పేరుతో బీఆర్‌ఎస్ బహిరంగసభ నిర్వహిస్తుంది.