Chairman’s Desk: ఒకప్పుడు కార్తీక మాసమంటే ఏదో పౌర్ణమి రోజు దీపం పెట్టుకోవడం తప్ప.. ఓ సాదాసీదా పండుగలా గడిచిపోయేది. కానీ భక్తి టీవీ కోటి దీపోత్సవం.. దీపోత్సవం అవసరం, దీపారాధన ప్రాధాన్యం.. సాంస్కృతికంగా, శాస్త్రీయంగా.. వీటికున్న ప్రాముఖ్యతను జనంలోకి తీసుకెళ్లింది. కోటి దీపోత్సవం ప్రభావంతోనే ఈరోజు కార్తీక మాసంలో ప్రతి ఆలయంలో దీపాలు వెలుగుతున్నాయి. ప్రతి ఇంటా కార్తీక మాసంలో దీపం పెట్టడమనేది తప్పనిసరి ఆచారంగా మారింది. నిజానికి ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక ఆచారం ఈరోజు…
Chairman's Desk: రాష్ట్రంలో లిక్కర్ స్కాంలు, నకిలీ లిక్కర్, బినామీ పేర్లతో బ్రాందీ షాపులు, పర్మిట్ రూంలు, బెల్ట్ షాపులు.. ఇవి తప్ప వేరే మాటలు వినిపించవా? గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం లిక్కర్ మీదే బతుకుతున్నాయా? ఇటీవల రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం వ్యవహారం చూస్తుంటే.
దేశంలో ఎక్కడ న్యాయం జరగకపోయినా.. కోర్టుకెళ్తే కచ్చితంగా న్యాయం దక్కుతుందని మొన్నటివరకూ సామాన్యులకు ఆశలుండేవి. అలాగే జడ్జిలు నిజాయితీగా ఉంటారని, నిష్పాక్షికంగా తీర్పులిస్తారనే నమ్మకం ఉండేది. కానీ ఇటీవల ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వర్మ ఇంట్లో కట్టలు కొద్ది క్యాష్ దొరకడం దేశంలోనే సంచలనం సృష్టించింది.
Chairman’s Desk : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదకొండేళ్లైంది. ఓవైపు తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోంది. కానీ ఏపీలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది.అలాగని ఏపీలో అభివృద్ధికి అవకాశాల్లేవని కాదు. కానీ ఉన్న బలాలపై దృష్టి పెట్టకుండా.. ఎక్కడో చూసిన అభివృద్ధినే.. అక్కడ రిపీట్ చేయాలనుకోవడమే మైనస్ గా మారుతోంది. ప్రతి రాష్ట్రానికీ వ్యూహాత్మక అనుకూలతలు ఉంటాయి. వాటికి తగ్గట్టుగా అభివృద్ధి ప్రణాళికలు ఉండాలి. అంతే కానీ ఓ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మోడల్..…
అమెరికా అధ్యక్షుడ్ ట్రంప్ ఇండియాకు అడుగడుగునా ద్రోహమే చేస్తున్నారు. వీసాల విషయంలో కఠినంగా ఉంటున్నారు. వలసల అంశంలోనూ పగబట్టినట్టుగా వ్యవహరించారు. ఇక సుంకాలైతే చెప్పక్కర్లేదు. చివరకు కీలకమైన యుద్ధం సమయంలోనూ మనకు హ్యాండిచ్చారు. ట్రంప్ ను మొదట్నుంచీ నెత్తిన పెట్టుకున్న ఎన్నారైలకు.. వైట్ హౌస్ లో అడుగుపెట్టగానే షాకిచ్చారు ట్రంప్. అలాగే ట్రంప్ కు చాలా ప్రాధాన్యత ఇచ్చిన మోడీకి కూడా తలనొప్పులే సృష్టించారు. ఏతావాతా ట్రంప్ మిత్రుడి ముసుగు తీసేయడంతో.. భారత్ కు అసలైన ద్రోహి…
భారత దేశం అంటే హిందువులు. సెక్యులర్ దేశమని, లౌకిక రాజ్యమని ఎంత చెప్పుకున్నా.. దేశంలో 80 శాతం పైన హిందువులే. కానీ హిందువులు ఓ మతం కాదు. ఓ జాతి. అది భారతదేశపు జాతి. హిందూ ధర్మం, సనాతన ధర్మం ఈరోజు పుట్టుకొచ్చింది కాదు. వేల ఏళ్ల నుంచి హిందూ మతం ఉంది. ఇప్పుడు బీజేపీ మాత్రం సనాతన ధర్మానికి కొత్త నిర్వచనాలు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. అలాగే మతానికీ, రాజకీయాలకూ ముడిపెడుతోంది. కానీ ఈ దేశంలో…
Youth vs Indian Politics: రాజకీయాలు అంటరానివని, అనవసరమని యువత ఫీలౌతున్నారు. నెలకు ఓ లక్ష రూపాయలు జీతం, చిన్న కారు, డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ ఉంటే చాలు. అదే జీవితం అనుకుంటున్నారు. అంతకు మించి ఆలోచించటానికి పెద్దగా ఇష్టపడటం లేదు. దీంతో రాజకీయాలు వంశపారంపర్యం అయిపోయాయి. సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేల వారసులే రాజకీయాల్లోకి వస్తున్నారు. వారిలో యూత్ ను వెతుక్కోవాల్సిందే కానీ.. సాధారణ యువత మాత్రం రాజకీయాలంటే అదో డర్టీ ప్రొఫెషన్ గా భావిస్తున్నారు. కాస్త…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లేచే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. రియల్ ఎస్టేట్ మరింత పతనమైందని.. 27శాతం కుంగిపోయిందని.. కమర్షియల్ స్పేస్ వెళ్లడం లేదని.. లక్షన్నర ఫ్లాట్లు కొనేవాళ్లు లేక అలాగే పడి ఉన్నాయని రకరకాల నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల అన్రాక్ నివేదిక వచ్చింది. అయితే ఇవన్నీ మూడేళ్ల క్రితమే.. NTV చెప్పింది. ఈ నివేదికలన్నీ చెబుతున్న విషయాలను 2022 నుంచి శాస్త్రీయంగా విశ్లేషిస్తూ.. రియల్ ఎస్టేట్ పతనంపై NTV ఎన్నో కథనాలు ప్రసారం చేసింది. ఇప్పటికీ…
Chairman’s Desk : ప్రపంచం యుద్ధోన్మాదంతో ఊగిపోతోంది. నేతల పంతాలు, పట్టింపులతో కోట్ల మంది ప్రభావితం అవుతున్నారు. ఇప్పటికే ఆర్థిక విధ్వంసం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా.. గెలుపోటముల గురించే తప్ప జనం కన్నీళ్ల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. నాలుగేళ్ల క్రితమే కరోనా ప్రపంచానికి మర్చిపోలేని గుణపాఠం నేర్పింది. పేద ధనిక దేశాలనే తేడా లేకుండా అన్నింటికీ ప్రాణ, ఆర్థిక నష్టం తప్పలేదు. అయినా సరే ప్రపంచ దేశాలు మారకుండా చిన్న చిన్న ఘర్షణలను.. చేజేతులా యుద్ధాలుగా…
ప్రధానిగా పదకొండేళ్లు పూర్తిచేసుకున్న మోడీ.. మరోసారి గెలుపు దిశగా ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే వరుసగా మూడుసార్లు కేంద్రంలో అధికారం దక్కించుకున్న బీజేపీ.. నాలుగోసారి పవర్లోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. మన దేశంలో నాలుగోసారి వరుస గెలుపు అంత తేలిక కాదనే వాదన ఉన్నా.. మోడీకి, బీజేపీకి కొన్ని సానకూలతలు లేకపోలేదనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో ప్రతికూలతల సంగతేంటనే ప్రశ్నలూ లేకపోలేదు. మరి పొలిటికల్ బాహుబలిగా ఎదిగిన మోడీ.. తన ఛరిష్మాను మరో నాలుగేళ్లు నిలబెట్టుకుంటారా..? ప్రజల్ని మరోసారి…