హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లేచే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. రియల్ ఎస్టేట్ మరింత పతనమైందని.. 27శాతం కుంగిపోయిందని.. కమర్షియల్ స్పేస్ వెళ్లడం లేదని.. లక్షన్నర ఫ్లాట్లు కొనేవాళ్లు లేక అలాగే పడి ఉన్నాయని రకరకాల నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల అన్‌రాక్ నివేదిక వచ్చింది. అయితే ఇవన్నీ మూడేళ్ల క్రితమే.. NTV చెప్పింది. ఈ నివేదికలన్నీ చెబుతున్న విషయాలను 2022 నుంచి శాస్త్రీయంగా విశ్లేషిస్తూ.. రియల్ ఎస్టేట్ పతనంపై NTV ఎన్నో కథనాలు ప్రసారం చేసింది. ఇప్పటికీ…
Chairman’s Desk : ప్రపంచం యుద్ధోన్మాదంతో ఊగిపోతోంది. నేతల పంతాలు, పట్టింపులతో కోట్ల మంది ప్రభావితం అవుతున్నారు. ఇప్పటికే ఆర్థిక విధ్వంసం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా.. గెలుపోటముల గురించే తప్ప జనం కన్నీళ్ల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. నాలుగేళ్ల క్రితమే కరోనా ప్రపంచానికి మర్చిపోలేని గుణపాఠం నేర్పింది. పేద ధనిక దేశాలనే తేడా లేకుండా అన్నింటికీ ప్రాణ, ఆర్థిక నష్టం తప్పలేదు. అయినా సరే ప్రపంచ దేశాలు మారకుండా చిన్న చిన్న ఘర్షణలను.. చేజేతులా యుద్ధాలుగా…
ప్రధానిగా పదకొండేళ్లు పూర్తిచేసుకున్న మోడీ.. మరోసారి గెలుపు దిశగా ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే వరుసగా మూడుసార్లు కేంద్రంలో అధికారం దక్కించుకున్న బీజేపీ.. నాలుగోసారి పవర్లోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. మన దేశంలో నాలుగోసారి వరుస గెలుపు అంత తేలిక కాదనే వాదన ఉన్నా.. మోడీకి, బీజేపీకి కొన్ని సానకూలతలు లేకపోలేదనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో ప్రతికూలతల సంగతేంటనే ప్రశ్నలూ లేకపోలేదు. మరి పొలిటికల్ బాహుబలిగా ఎదిగిన మోడీ.. తన ఛరిష్మాను మరో నాలుగేళ్లు నిలబెట్టుకుంటారా..? ప్రజల్ని మరోసారి…
ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. ప్రశాంతంగా ఉన్న కశ్మీర్.. మరోసారి నెత్తురోడింది. పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి.. 26 మంది పర్యాటకుల్ని పొట్టనపెట్టుకున్నారు. దీని వెనక పాకిస్థాన్ ఉందని తేలిపోవడంతో దేశమంతా రగలిపోతుంది. యుద్ధం ప్రకటించి.. దాయాదికి తగిన బుద్ధి చెప్పాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మన సత్తా చూపాలని, పాకిస్థాన్ తిరిగి లేవకుండా.. చావ చితక్కొట్టాలని చాలామంది కోరుతున్నారు.
అతి తక్కువ కాలంలో మీడియా రంగంలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం అంటే అది ఆషామాషీ కాదు.. కానీ, అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపింది ఎన్టీవీ.. మాట చెప్పడం.. మాట ఇవ్వడం చాలా సులువు. కానీ, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. దానికి కట్టుబడి ఉండడం అంత తేలికైన విషయం కాదు. ఎన్నో సవాళ్లు.. అంతకు మించి కష్ట నష్టాలు.. అయినా.. ప్రతిక్షణం -ప్రజాహితం అంటూ సమాజం ముందుకు వచ్చిన ఎన్టీవీ ఆ బాటలోనే ఇన్నాళ్లుగా.. ఇన్నేళ్లుగా.. పయనించడం…