పెగాసస్ దుమారం.. దీదీ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెగాసస్.. ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం ఇప్పుడు భారత్‌లో సంచలనంగా మారింది… ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తుండగా.. పార్లమెంట్ సమావేశాలను సైతం పెగాసస్ వ్యవహారం కుదిపేస్తోంది.. ఈ తరుణంలో.. సంచలన వ్యాఖ్యలు చేశారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ప్రజాస్వామ్య భారత్‌ను మోడీ సర్కారు నిఘా దేశంగా తయారు చేయాలనుకుంటోందని దుయ్యబట్టిన ఆమె.. పెగాసస్‌కు భయపడి తన ఫోన్‌కు ప్లాస్టర్ వేసుకున్నానని తెలిపారు.. కేంద్ర ప్రభుత్వ విపరీత చర్యలకు కూడా ప్లాస్టర్ వేయాల్సిందేనని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. ఇక, ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు దీదీ.
భారత్‌లో సంక్షేమం మానేసి బీజేపీ సర్కార్ నిఘా దేశంగా మార్చాలనుకుంటోందని ఫైర్ అయ్యారు మమతా బెనర్జీ.. అందుకే పెట్రోల్, డీజిల్, ఇతర వస్తు, సేవల ద్వారా ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తోన్న సొమ్ముతో సంక్షేమ పథకాలు చేపట్టకుండా.. వ్యక్తులపై నిఘా పెట్టేందుకు.. ప్రమాదకరమైన సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసేందుకు వినియోగిస్తున్నారంటూ విమర్శించారు. ఇక, తన ఫోన్‌ను కూడా ట్యాపింగ్ చేస్తారని తెలుసు.. అందుకే ఎన్సీసీ అధినేత శరద్ పవార్, ఇతర ప్రతిపక్ష నేతలు, సీఎంలతో నేను ఫోన్లలో మాట్లాడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు దీదీ.. పెగాసస్‌కు భయపడి నా ఫోన్‌కు ప్లాస్టర్ వేసుకున్నానని.. కానీ, హ్యాకింగ్ వంటివేవీ వారిని రక్షించలేవంటూ వార్నింగ్ ఇచ్చారు. రానున్న సాధారణ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి కూడా ప్లాస్టర్ వేయాలని పిలుపునిచ్చారు.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!